Telugu TV Shows TRP: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. ఈటీవీని వెనక్కి నెట్టిన స్టార్ మా షోస్
Telugu TV Shows TRP: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈవారం ఈటీవీని వెనక్కి నెట్టి స్టార్ మాకు చెందిన రెండు షోలు టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం.
Telugu TV Shows TRP: తెలుగు టీవీ షోలకు సంబంధించి 35వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 34వ వారంతో పోలిస్తే ఇందులో భారీ మార్పులు చోటు చేసుకోవడం విశేషం. అనూహ్యంగా స్టార్ మాకు చెందిన రెండు షోలు టాప్ 2లోకి దూసుకెళ్లాయి. ఇక గత వారం టాప్ లో ఉన్న ఈటీవీ షో ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.
స్టార్ మా హవా
తాజాగా రిలీజైన తెలుగు టీవీ షోల టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మాలో వచ్చే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ షో టాప్ లోకి దూసుకొచ్చింది. ఈ షో అర్బన్, రూరల్ కలిపి ఏకంగా 4.91 రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచింది. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకుంటే ఈ షోకి 5.45 రేటింగ్ రావడం విశేషం.
ఇక రెండో స్థానంలోనూ స్టార్ మాలోనే వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో 4.65 రేటింగ్ తో నిలిచింది. ఈ రెండు షోలనూ శ్రీముఖియే హోస్ట్ చేస్తుండటం ఇక్కడ మరో విశేషంగా చెప్పొచ్చు.
కాస్త తగ్గిన ఈటీవీ
ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా రేటింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయింది. ఈ షో అర్బన్, రూరల్ రేటింగ్స్ కలిపి 4.09గా ఉన్నాయి. గత వారం ఈ షో టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అదే ఈటీవీలో వచ్చే ఢీ సెలబ్రిటీ స్పెషల్ డ్యాన్స్ షో 3.22 రేటింగ్ తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ 3.01 రేటింగ్ తో ఐదో స్థానంలో ఉంది. మొత్తంగా టాప్ 5లో రెండు స్టార్ మా, మూడు ఈటీవీ షోలు ఉన్నాయి.
జీ తెలుగులో వచ్చే మరో షో డ్రామా జూనియర్స్ కూడా ఈవారం 3.01 రేటింగ్ తో జబర్దస్త్ తో సమంగా నిలిచింది. నిజానికి అర్బన్ రేటింగ్స్ లో 3.45తో జబర్దస్త్ కంటే కూడా మెరుగ్గా ఉంది. ఈటీవీ షో సుమా అడ్డా 2.21, పాడుతా తీయగా 1.46 రేటింగ్స్ సాధించాయి.
34వ వారం రేటింగ్స్ ఇలా..
అంతకుముందు 34వ వారం రేటింగ్స్ ఇలా ఉన్నాయి. 34వ వారం కోసం రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా, ఈటీవీ షోల మధ్య హోరాహోరీగా పోటీ నడిచింది. ఈ లిస్ట్ లో ఈటీవీకి చెందిన షో టాప్ ప్లేస్ కొట్టేయగా.. స్టార్ మా షో తృటిలో మిస్ అయింది. మరి టాప్ 10లో ఉన్న ఆ షోలు ఏవో చూద్దామా?
తాజా టీఆర్పీ రేటింగ్స్ లో ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ లో నటించింది. ఈ షో అర్బర్, రూరల్ కలిపి 4.49 రేటింగ్ సాధించింది. కేవలం అర్బన్ అయితే 4.10గా ఉంది. ఇక రెండో స్థానంలో స్టార్ మా షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం 4.28 రేటింగ్ తో ఉండటం విశేషం. కొద్దిలో ఈ షో టాప్ స్పాట్ మిస్ అయింది.
మూడో స్థానంలోనూ స్టార్ మా ఛానెల్ కే చెందిన కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో ఉంది. ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 4.14 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో ఈటీవీలో వచ్చే ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నిలిచింది. ఈ షో 3.19 రేటింగ్ సంపాదించింది. తర్వాత ఐదో స్థానంలోనూ ఈటీవీలోనూ వచ్చే జబర్దస్త్ కామెడీ షో 3.14 రేటింగ్ తో ఉంది.