Tillu Square OTT Rights: టిల్లు స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ప్లాట్‍ఫామ్‍: వివరాలివే-siddu jonnalagadda and anupama parameswaran tillu square digital streaming rights bagged by netflix ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square Ott Rights: టిల్లు స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ప్లాట్‍ఫామ్‍: వివరాలివే

Tillu Square OTT Rights: టిల్లు స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ప్లాట్‍ఫామ్‍: వివరాలివే

Tillu Square OTT Platform: టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఆ మూవీ ఓటీటీ హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..

Tillu Square OTT Rights: టిల్లు స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ప్లాట్‍ఫామ్‍: వివరాలివే

Tillu Square OTT: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ మంచి హైప్‍తో థియేటర్లలో రానుంది. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ క్రేజీ రొమాంటిక్ కామెడీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రేపు (మార్చి 29) ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. 2022లో వచ్చిన బ్లాక్‍బస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్‍గా టిల్లు స్క్వేర్ వస్తోంది. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ క్రేజీ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను కూడా ఇప్పుడే లాక్ చేసేసుకుంది.

హక్కులు ఈ ప్లాట్‍ఫామ్ వద్ద..

టిల్లు స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట‍్‍ఫామ్ ‘నెట్‍ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ మూవీ హక్కుల కోసం నెట్‍ఫ్లిక్స్ మంచి ధరే ఇచ్చిందని సినీ సర్కిల్‍లో టాక్.

డీజే టిల్లు సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంటే.. టిల్లు స్క్వేర్ హక్కులను మాత్రం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీగా క్రేజ్ ఉండటంతో ఈ సీక్వెల్‍కు థియేట్రికల్ రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్ చేసుకుంది నెట్‍ఫ్లిక్స్. ఈ చిత్రం మే తొలివారంలో స్ట్రీమింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది థియేట్రికల్ రన్‍పై ఆధారపడి ఉంటుంది.

డీజే టిల్లు మూవీతో సిద్ధు జొన్నలగడ్డ పోషించిన ‘టిల్లు’ క్యారెక్టర్ ఐకానిక్‍గా మారింది. ఆయన వెరైటీ డైలాగ్ డెలివరీ, ఫ్రస్టేషన్, కామెడీ టైమింగ్ ఇలా చాలా అంశాలతో టిల్లు పాత్రకు క్రేజ్ వచ్చింది. అయితే, థీమ్ ఒకటే అయినా డీజే టిల్లు కథకు ఇప్పుడు రానున్న టిల్లు స్క్వేర్ స్టోరీకి సంబంధం ఉండదని మూవీ టీమ్ గతంలో సిగ్నల్స్ ఇచ్చింది.

టిల్లు స్క్వేర్ గురించి..

టిల్లు స్క్వేర్ సినిమాపై ట్రైలర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. సిద్ధు మరోసారి తన మార్క్ యాక్టింగ్‍తో అదరగొట్టగా.. అనుపమ పరమేశ్వన్ బోల్డ్ క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది. అనుపమ ఇలాంటి పాత్ర చేయడంపై చర్చ కూడా విపరీతంగా సాగింది. అయితే, తనకు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుందని, అందుకే ఈ మూవీ చేశానని ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు.

టిల్లు స్క్వేర్ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, ప్రణీత్ రెడ్డి కల్లెమ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో లిల్లీ క్యారెక్టర్ చేశారు అనుపమ పరమేశ్వరన్. లిల్లీ వల్లే చిక్కుల్లో పడే టిల్లుగా సిద్దు మరోసారి హంగామా చేయనున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక క్యారెక్టర్ చాలా పాపులర్ అయింది. టిల్లు స్క్వేర్ ద్వారా లిల్లీ పాత్ర కూడా అలాంటి ఎఫెక్టే చూపించనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

టిల్లు స్క్వేర్ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. భీమ్స్ సెసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. బీజీఎం కోసం ముందుగా థమన్‍ను అనుకున్నా.. ఆయన బిజీగా ఉండటంతో ఆ అవకాశం భీమ్స్ చెంతకు చేరింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.