Anupama Parameswaran: బోల్డ్ క్యారెక్టర్ చేయడంపై ప్రశ్నలు: స్ట్రాంగ్‍గా బదులిచ్చిన అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran on Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వర్ కాస్త బోల్డ్ క్యారెక్టర్ చేశారు. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కనిపించారు. ఈ విషయంపై నేడు ఆమెకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అనుపమ స్ట్రాంగ్‍గా సమాధానం చెప్పారు.
Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ సినిమాలో మూడో సాంగ్ రిలీజ్ కోసం నేడు (మార్చి 18) ఈవెంట్ జరిగింది. ‘ఓ మై లిల్లీ’ అంటూ ఈ పాట రిలీజ్ అయింది. బ్రేకప్ సాంగ్‍గా ఎమోషనల్‍గా ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‍కు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హాజరయ్యారు. మీడియాతో మాట్లాడారు. అయితే, టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేయడంపై అనుపమ పరమేశ్వన్‍కు వరుసగా ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో కాస్త గట్టిగానే ఆమె సమాధానం చెప్పారు.
రోజూ బిర్యానినే తింటారా?
ఇష్టమని చెప్పి మీరు ప్రతీ రోజు బిర్యానీనే తింటారా.. కాదు కదా అని రిపోర్టర్‌ను అనుపమ పరమేశ్వరన్ తిరిగి ప్రశ్నించారు. అలాగే, తాను కూడా వివిధ రకాల క్యారెక్టర్లు చేసేందుకు ఇష్టపడతానని అనుపమ అన్నారు.
డైరెక్టర్ ఇచ్చిన పాత్రను 100 శాతం చేయడమే తన డ్యూటీ అని స్ట్రాంగ్ రిప్లే ఇచ్చారు అనుపమ. “మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. ప్రతీ రోజూ ఇంట్లో బిర్యానీనే తినరు కదా.. అలాగే నేనూ ప్రతీ రోజు బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు డిఫరెంట్.. డిఫరెంట్ పులావ్ కావాలి.. పులిహోర కావాలి.. అంతే. డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్‌ను 100 శాతం చేయడం నా డ్యూటీ. అది చేయడానికి నేను ట్రై చేశా” అని అనుపమ పరమేశ్వరన్ సమాధానం చెప్పారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ బెస్ట్ అని ఆమె తెలిపారు.
తన గత చిత్రాలకు భిన్నంగా టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేయడంతో అనుపమకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో సిద్ధుతో లిప్ లాక్ సీన్లలోనూ ఆమె నటించారు. ట్రైలర్లోని కొన్ని డైలాగ్స్ కూడా బోల్డ్‌గా ఉన్నాయి.
ఇది బెస్ట్ క్యారెక్టర్
సంవత్సరాల పాటు ఒకే లాంటి క్యారెక్టర్ చేస్తుంటే ఎవరికైనా బోరు కొడుతుందని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. అంతకంటే.. టిల్లు స్క్వేర్ మూవీలో తాను చేసిన లిల్లీ పాత్ర ఒకానొక బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పారు. ఈ చిత్రంలో తనకు వచ్చిన క్యారెక్టర్ వదులుకొని ఉంటే మూర్ఖత్వమైన పనిగా ఉండేదని ఆమె చెప్పారు. ఓ కమర్షియల్ సినిమాలో ఓ అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరగదని తాను చెప్పగలనని అన్నారు.
త్రివిక్రమ్ టైటిల్ చెప్పారు
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‍గా టిల్లు స్క్వేర్ మూవీ వస్తోంది. అయితే, ఈ చిత్రానికి టిల్లు 2, టిల్లు రిటర్న్స్ ఇలా కొన్ని టైటిళ్లు అనుకున్నా సరిగా సెట్ కాలేదని, రొటీన్‍గా అనిపించాయని సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు. అయితే, టిల్లు స్క్వేర్ అందామని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారని తెలిపారు. బాగుందని చెప్పి.. అదే టైటిల్‍ను ఫిక్స్ చేశామని సిద్ధు అన్నారు.
మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. నేడు (మార్చి 18) ఈ మూవీ నుంచి మూడో పాటగా ‘ఓ మై లిల్లీ’ సాంగ్ వచ్చింది. ఈ పాటకు అచ్చు రాజమణి ట్యూన్ ఇచ్చారు. రామ్ మిర్యాల, శ్రీచరణణ్ పాకాల కూడా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్నాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల నుంచి థమన్ వైదొలగగా.. భీమ్స్ సెసిరోలియో నిర్వర్తిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది.