Tillu Square Radhika song: టిల్లు స్క్వేర్ నుంచి ‘రాధిక’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఉర్రూతలూగించేలా..
Tillu Square Radhika song: టిల్లు స్క్వేర్ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. రాధిక పేరుతో వచ్చిన సాంగ్ యూత్‍ను ఉర్రూతలూగించేలా ఉంది.

Tillu Square Radhika song: టాలెండెడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. గతేడాది ‘డీజే టిల్లు’ మూవీ సెన్సేషనల్ హిట్ కొట్టింది. సిద్ధు ఒక్కసారిగా స్టార్ అయిపోయారు. ‘డీజే టిల్లు’కు సీక్వెల్‍గా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ సినిమా తెరకెక్కుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. అయితే, టిల్లు స్క్వేర్ నుంచి రెండో పాట నేడు (నవంబర్ 27) రిలీజ్ అయింది. ఇటీవలే ఈ పాట ప్రోమో హల్‍చల్ చేయగా.. నేడు పూర్తి లిరికల్ సాంగ్ వచ్చింది.
టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి ‘రాధిక’ అనే రెండో పాట నేడు రిలీజ్ అయింది. “చెప్పు రాధిక.. ఏం కావాలి నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎలా ముంచబోతున్నావు చెప్పు” అనే సిద్ధు డైలాగ్‍తో ఈ లిరికల్ సాంగ్ మొదలైంది. “రాధిక ఎవరు.. నా పేరు లిల్లీ” అంటుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. “పేరు లిల్లీ అయినా.. మనిషివైతే రాధికవు నువ్వు” అని సిద్ధు అంటారు. రాధిక జాతి, రాధిక ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటూ సిద్ధు చెప్పే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. డీజే టిల్లులో రాధిక పాత్రను గుర్తు చేసేలా ఈ డైలాగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత సాంగ్ మొదలైంది.
“రాధిక.. రాధిక.. రాధిక.. ముందుకా.. వెనకకా.. కిందకా.. మీదకా” అంటూ ఈ పాట షురూ అయింది. ముంచక, తేల్చకా.. ఆటలేందే ఇక అంటూ సాగింది. ఈ రాధిక పాటకు ఫుల్ జోష్‍గా ఉండే బీట్ అందించారు రామ్ మిర్యాల. ఈ పాటను ఆయనే పాడారు కూడా. ఈ సాంగ్‍కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. యూత్‍కు కనెక్ట్ అయ్యేలా క్యాచీ లైన్స్ ఆకట్టుకుంటున్నాయి.
సింగర్, మ్యూజిక్ కంపోజర్ రామ్ మిర్యాల - లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కాంబోలోనే టిల్లు స్క్వేర్ నుంచి “టికెట్టే కొనకుండా” అంటూ గతంలో తొలి సాంగ్ వచ్చింది. అది ఫుల్ పాపులర్ అయింది. ఇప్పుడు రాధిక సాంగ్ కూడా అదే జోష్‍తో యూత్‍కు కనెక్ట్ అయ్యేలా ఉంది. దీంతో ఈ రెండో పాటకు క్రేజ్ ఫుల్ క్రేజ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి కూడా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.