Tenant OTT: ఓటీటీ కోసం తీసిన సినిమా థియేటర్లలో రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన హీరో
Satyam Rajesh About Tenant OTT Release: కొన్ని సినిమాలను ఓటీటీ కోసం తెరకెక్కించి థియేటర్లలో విడుదల చేస్తుంటారు. అలాంటి లేటెస్ట్ సినిమానే టెనెంట్. సత్యం రాజేష్ నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాకపోవడంపై హీరో క్లారిటీ ఇచ్చాడు.
Tenant OTT Release: సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న మరో సినిమా టెనెంట్. ఈ సినిమాను ముందుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్రీకరణ స్టార్ట్ చేశారు. కానీ, ఇటీవల నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టెనెంట్ ఓటీటీలో విడుదల కాకపోవడంపై సత్యం రాజేష్ క్లారిటీ ఇచ్చాడు.
ఇది ఓటీటీ కోసం తీసిన కథ అని చెప్పారు. కానీ, థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు.
కథ చాలా బాగుందని చిన్న సినిమాగా స్టార్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం. అంతేకానీ, పొలిమేర 2 సక్సెస్ రావడం వల్ల థియేటర్లలో రిలీజ్ చేయట్లేదు.
మీరు అన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు. ఎందుకు?
నా దగ్గరకు వచ్చిన వాటిలో నేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా.
థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఎలా ఉంటుంది?
ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్‌కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఇకపై హీరోగానే చేస్తారా? ఆర్టిస్ట్‌గా కూడా కొనసాగుతారా?
నేను ఆర్టిస్టుగా చేస్తా. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా. హీరో అంటే ఎలివేషన్స్ ఉండాలి. కానీ, నాకు అలాంటి ఎలివేషన్స్ నచ్చవు. నేను మెయిన్ క్యారెక్టర్‌లో స్ట్రీట్ ఫైట్ అనే ఒక కామెడీ సినిమా చేస్తున్నా. అందులో ఎలివేషన్స్ ఉండవు కానీ.. కమర్షియల్ సినిమాలా ఉంటుంది.
క్షణం లాంటి క్యారెక్టర్స్ మీ దగ్గరకు రాలేదా? వచ్చినా మీరు చేయలేదా?
క్షణం తర్వాత దగ్గర దగ్గర 50 సినిమాల్లో పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ, మళ్లీ అలాంటి పాత్రలే చేస్తే బాగోదని చేయలేదు. కొన్ని పోలీస్ పాత్రలు కామెడీ చేసేలా ఉంటాయి. అలాంటివి చేయను. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే చేయొచ్చు. ప్రకాష్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక.