Ester Noronha: డైరెక్టర్‍ గా మారిన హీరోయిన్.. స్వీయ దర్శకత్వం, సంగీతంలో ఎస్తర్ మూవీ-heroine ester noronha pan india movie the vacant house in own direction ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ester Noronha: డైరెక్టర్‍ గా మారిన హీరోయిన్.. స్వీయ దర్శకత్వం, సంగీతంలో ఎస్తర్ మూవీ

Ester Noronha: డైరెక్టర్‍ గా మారిన హీరోయిన్.. స్వీయ దర్శకత్వం, సంగీతంలో ఎస్తర్ మూవీ

Sanjiv Kumar HT Telugu
Sep 14, 2023 01:32 PM IST

Ester Noronha The Vacant House: ప్రముఖ దర్శకుడు తేజ 100 అబద్ధాలు సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ ఎస్తర్ నోరోన్హా. మొదటి చిత్రంతో ఆకర్షించిన ఈ బ్యూటి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా 'ది వేకెంట్ హౌస్‍'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డైరెక్టర్‍గా మారిన హీరోయిన్.. స్వీయ దర్శకత్వం, సంగీతంలో ఎస్తర్ మూవీ
డైరెక్టర్‍గా మారిన హీరోయిన్.. స్వీయ దర్శకత్వం, సంగీతంలో ఎస్తర్ మూవీ

టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో ఎస్తర్ నోరోన్హా ఒకరు. 1000 అబద్దాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటి అనంతరం సునీల్ భీమవరం బుల్లోడు, 69 సంస్కార్ కాలనీ వంటి చిత్రాలతో అలరించారు. ఇవే కాకుండా తులు భాషలో 2019లో వచ్చిన ఒరిజినల్ కాంతార సినిమాలో నటించి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే హీరోయిన్‍గా, గాయకురాలిగా వివిధ రకాల టాలెంట్ చూపించిన ఎస్తర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ది వేకెంట్ హౌస్ మూవీతో రానున్నారు.

అయితే ది వేకెంట్ హౌస్ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సాహిత్యం, పాటలు, నేపథ్య స్కోర్‌ తో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు ఎస్తర్ నోరన్హా. దీంతో ఆమె మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అని మరోసారి అనిపించుకున్నారు. ఈ సినిమాను ఎస్తర్ నోరోన్హా తల్లి జానెట్ నోరోన్హా నిర్మిస్తున్నారు. ఎస్తర్ నోరోన్హా దర్శకురాలిగా పరిచయం అవుతున్న ది వేకెంట్ హౌస్ సినిమాను కన్నడ, గోవా కొంకణి భాషల్లో రూపొందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించే సబ్జెక్ట్ కావడంతో పాన్ ఇండియాగా తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎస్తర్ నోరోన్హా తల్లి జానెట్ నొరోన్హా ఇంతకుముందు 'సోఫియా ఏ డ్రీమ్ గర్ల్' అనే కొంకణి మూవీని నిర్మించింది. ఈ చిత్రంతో ఎస్తర్ నోరోన్హా 2018 కర్ణాటక రాష్ట్ర అవార్డును గెలుచుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ ఎస్తర్.. మాస్, గ్లామర్, డీ గ్లామర్ ఇలా ఎలాంటి పాత్రలు చేయడానికైనా సాహసిస్తున్నారు. తన ప్రతిభతో సొంత బ్యానెర్‍లో నిర్మించి, తెరకెక్కించిన ''ది వేకెంట్ హౌస్'' మూవీ త్వరలోనే థియేటర్‍లో విడుదలకు రంగం సిద్దం అయింది. కాగా ఈ సినిమాకు ఎస్తర్ దర్శకత్వం, రచన, సంగీతం బాధ్యతలు చేపడుతున్నారు.

Whats_app_banner