OTT: ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?-katha venuka katha ott response on etv win and katha venuka katha ott streaming now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

OTT: ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 07, 2024 01:40 PM IST

Katha Venuka Katha OTT Response: తెలుగులోకి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ. ప్రముఖ ఓటీటీలో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దుమ్ముదులుపుతోంది. కథ వెనుక కథ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

Katha Venuka Katha OTT Streaming Now: వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే మూవీస్‌కు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ చిత్రాలు అంటే అన్ని రకాల కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజానే వేరు. అందుకే ఇటీవల ఓటీటీలో లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది.

ఆ సినిమా ఏదో కాదు.. పాపులర్ కమెడియన్, నటుడు సునీల్ (Sunil) నటించిన కథ వెనుక కథ. ప్రముఖ హాస్యనటుడు సునీల్‌తోపాటు యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది.

గతేడాది మే 12న థియేటర్లలో విడుదలైన కథ వెనుక కథ సినిమా ఈ సంవత్సరం మార్చి 28న ఓటీటీలోకి (OTT Movies) వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో (ETV Win) స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన కొద్ది కాలంలోనే ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ (IMDB Rating) సంస్థ 10కి 7.3 రేటింగ్ ఇవ్వడం విశేషం. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య వైవిధ్యమైన వివిధ రకాల కథ, కథనాలతో ప్రేక్షకులను ఈ సినిమాతో అనుక్షణం థ్రిల్‌కు గురిచేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఔరా అనిపిస్తుంది.

దర్శకుడు అయుండి తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్.. ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటారో.. అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే విశ్వంత్ నటన ఇందులో ఉంటుంది. ఆలీ, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్.. ఇలా ఇందులో నటించిన వారంతా తమ శక్తిమేరకు మెప్పించారనే చెప్పొచ్చు.

అలాంటి సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్రకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణ విలువలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని.. అందుకే ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తమ సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారని ప్రొడ్యూసర్ అవనీంద్రకుమార్ అన్నారు.

ఇది తమకు ఎంతో బూస్టప్ ఇచ్చిందని అవనీంద్రకుమార్ తెలిపారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత అవనీంద్రకుమార్. ఇక వివిధ పాత్రలతో ఆకట్టుకునే సునీల్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు. ఈ పాత్రలో సునీల్ ఎంతో అద్భుతంగా ఒదిగిపోయారని మేకర్స్ తెలిపారు.

IPL_Entry_Point