Sasimadhanam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-sasimadhanam ott release date etv win ott romantic comedy drama web series teaser out sidhu pavan sonia singh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sasimadhanam Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sasimadhanam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 15, 2024 08:54 PM IST

Sasimadhanam OTT Release Date: శశిమథనం వెబ్ సిరీస్ టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

Sasimadhanam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sasimadhanam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sasimadhanam OTT Release Date: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి మరో వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఇటీవల దూకుడుగా కంటెంట్ తీసుకొస్తున్న ఈ ప్లాట్‍ఫామ్ మరో సిరీస్‍కు రెడీ అయింది. రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్‍గా ‘శశిమథనం’ వెబ్ సిరీస్ రానుంది. సిద్దు పవన్, సోనియా సింగ్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ టీజర్‌ను నేడు (జూన్ 15) రిలీజ్ చేసింది ఈటీవీ విన్.

టీజర్ ఇలా..

తాను ఫ్యామిలీతో కలిసి పదిరోజులు పెళ్లి కోసం వేరే ఊరికి వెళుతున్నట్టు తన లవర్ మదన్ (సిద్ధు పవన్)తో శశిరేఖ (సోనియా సింగ్) చెప్పడంతో శశిమథనం సిరీస్‍ టీజర్ మొదలైంది. ఆ తర్వాత తన కుటుంబాన్ని శశిరేఖ పరిచయం చేస్తుంది. ఇదంతా సరదాగా ఉంది. “అందరినీ పంపించేసి నువ్వు ఉండిపో బేబి” అని శశిని అడుగుతాడు మదన్. ఆ తర్వాత పది రోజులు వేరే చోటికి వెళతానంటూ తన ఫ్యామిలీని ఒప్పించే పనిలో మదన్ పడతాడు.

ఆ తర్వాత శశి ఇంటికి మదన్ వెళతారు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతారు. అయితే, వారిద్దరూ రొమాంటిక్ మూడ్‍లో ఉండగా.. ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరొచ్చారో చూశార శశి, మదన్ అవాక్కవుతారు. ఇలా టీజర్ సరదాగా ఉంది. ఆ ఇద్దరూ కుటుంబ సభ్యులకు దొరికిపోతారా.. తప్పించుకుంటూ దాగుడుమూతలు ఆడుతారా అనేదే ఈ సిరీస్ స్టోరీ అనేలా కనిపిస్తోంది.

శశిమథనం వెబ్ సిరీస్ టీజర్ సరాదాగా ఇంట్రెస్టింగ్‍గానే ఉంది. శశిగా సోనియా, మదన్‍గా సిద్ధు అలరించడం పక్కాగా కనిపిస్తోంది. ఈ సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. సిన్‍జిత్ ఎర్రమల్లి సంగీతం అందించారు. మార్క్ మై వర్డ్స్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై హరీశ్ కోహిర్కర్ నిర్మించారు.

టీజర్ లాంచ్ చేసిన శ్రీవిష్ణు

శశిమథనం సిరీస్ టీజర్‌ను యంగ్ హీరో శ్రీవిష్ణు రివీల్ చేశారు. సిద్దు, సోనియా సింగ్, దర్శకుడు వినోద్ సహా సిరీస్ టీమ్ విష్ణును కలిశారు. ఆయన టీజర్ రిలీజ్ చేశారు.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

శశిమథనం వెబ్ సిరీస్ జూలై 4వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. చదువుల రాణి సరస్వతి శశి, లక్ష్మి కటాక్షం లేని మదన్ దాగుడు మూతలు చూద్దాం అంటూ నేడు టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈటీవీ విన్. జూలై 4న స్ట్రీమింగ్‍కు వస్తుందని కన్ఫర్మ్ చేసింది.

నేరుగా ఓటీటీలోకి రష్ సినిమా

యాక్షన్ డ్రామా మూవీ ‘రష్’ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఈవారమే జూన్ 13వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. నేరుగా ఓటీటీలోకే ఈ మూవీ అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు రవిబాబు ఈ చిత్రానికి కథ అందించటంతో పాటు నిర్మాతగానూ ఉన్నారు. రష్ చిత్రంలో డైసీ బోపన్న ప్రధాన పాత్ర పోషించారు. కిడ్నాప్ అయిన భర్త, పిల్లలను కాపాడుకునేందుకు ఓ మహిళ చేసే ప్రయత్నాల చుట్టూ రష్ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రానికి సతీశ్ పోలుజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవిబాబు పోలీస్‍గా నటించారు.

WhatsApp channel