Sasi Madhanam: తెలుగులో రొమాంటిక్ ల‌వ్ వెబ్‌సిరీస్ చేస్తోన్న విరూపాక్ష బ్యూటీ - శ‌శిమ‌థ‌నం స్ట్రీమింగ్ డేట్ ఇదే-pawan siddu sonia singh sasi madhanam telugu web series will be premiere on etv win ott from june 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sasi Madhanam: తెలుగులో రొమాంటిక్ ల‌వ్ వెబ్‌సిరీస్ చేస్తోన్న విరూపాక్ష బ్యూటీ - శ‌శిమ‌థ‌నం స్ట్రీమింగ్ డేట్ ఇదే

Sasi Madhanam: తెలుగులో రొమాంటిక్ ల‌వ్ వెబ్‌సిరీస్ చేస్తోన్న విరూపాక్ష బ్యూటీ - శ‌శిమ‌థ‌నం స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Jun 01, 2024 06:16 AM IST

Sasi Madhanam Web Series: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ జంట‌గా న‌టిస్తోన్న శ‌శిమ‌థ‌నం తెలుగు వెబ్ సిరీస్ జూన్ 4 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌కు వినోద్ గాలి ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

శ‌శిమ‌థ‌నం తెలుగు వెబ్ సిరీస్
శ‌శిమ‌థ‌నం తెలుగు వెబ్ సిరీస్

Sasi Madhanam Web Series: తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ‌స్ అయ్యారు ప‌వ‌న్ సిద్ధు , సోనియా సింగ్. టింగ్లీష్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌, డెస్టినీ డేట్‌, యూఆర్‌మై ఫేవ‌రేట్ మిస్టేక్‌, వీకెండ్ పెళ్లిచూపుల‌తో పాటు ప‌లు షార్ట్ ఫిలిమ్స్ జంట‌గా క‌నువిందు చేశారు. ఈ షార్ట్ ఫిలిమ్స్‌లో త‌మ కెమిస్ట్రీతో ఈ జోడీ ఆక‌ట్టుకున్నారు. తాజాగా ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ క‌లిసి తెలుగులోఓ రొమాంటిక్ ల‌వ్ కామెడీ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నారు. ఈ తెలుగు వెబ్‌సిరీస్‌కు శ‌శిమ‌థ‌నం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈటీవీ విన్ ద్వారా జూన్ 4న ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

శ‌శి మ‌ధ‌న్‌....

ఈ సిరీస్‌లో శ‌శి గా సోనియా సింగ్‌, మ‌ధ‌న్ పాత్ర‌లో ప‌వ‌న్ సిద్ధు క‌నిపించ‌బోతున్నారు. ఓ యువ‌ జంట మ‌ధ్య అపోహ‌లు, గిల్లిక‌జ్జాల‌తో ఆద్యంతం ఫ‌న్‌గా ఈ సిరీస్ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ క్యారెక్ట‌ర్స్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు. శ‌శిమ‌థ‌నం వెబ్‌సిరీస్‌కు వినోద్ గాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌కు సంజీత్‌ ఎర్ర‌మిల్లి మ్యూజిక్ అందిస్తోన్నాడు. రెహాన్ షేక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు

య‌మ‌లీల సీరియ‌ల్‌...

య‌మ‌లీల సీరియ‌ల్‌తో సోనియా సింగ్ యాక్టింగ్ జ‌ర్నీ ప్రారంభ‌మైంది. ఈ సీరియ‌ల్‌లో చిన్ని అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. ఓయ్ ప‌ద్మావ‌తి, పెళ్లైనా కొత్త‌లో, రౌడీబేబీ తో పాటు తెలుగులో ముప్పైకిపైగా వెబ్‌సిరీస్‌లు చేసింది . ప‌వ‌న్ సిద్ధుతో చేసిన షార్ట్ ఫిలిమ్స్‌తో యూత్ ఆడియెన్స్‌కు చేరువైంది.

విరూపాక్ష‌లో...

తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష‌లో సోనియా సింగ్ ఓ కీల‌క పాత్ర పోషించింది. సుధ అనే అమ్మాయిగా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది. తొలి అడుగులోనే ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల దృష్టిని ఆక‌ర్షించింది. నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌లో ఓ చిన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. తాను నేను, చిత్ర సార‌థి, నీవే, అన‌సూయ రామ‌లింగ‌ంతో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో తన నటనతో మెప్పించింది.

సినిమాలు...సీరిస్‌లు...

ప‌వ‌న్ సిద్ధు కూడా తెలుగులో షార్ట్‌ఫిలిమ్స్ తో పాటు కొన్ని సినిమాల్లో న‌టించాడు. గ‌తంలో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేశాడు. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. రాజుగారి కిడ్నాప్‌, అయ్యేరామా మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా క‌నిపించాడు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్