Pushpa 2 : పుష్ప 2 సెకండ్ సింగిల్ వచ్చేసింది - సూసేకీ సాంగ్‌లో రొమాంటిక్ స్టెప్పుల‌తో అదరగొట్టిన బ‌న్నీ…ర‌ష్మిక‌-pushpa 2 second single soseki released allu arjun and rashmika mandanna attract fans with their romantic steps ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 : పుష్ప 2 సెకండ్ సింగిల్ వచ్చేసింది - సూసేకీ సాంగ్‌లో రొమాంటిక్ స్టెప్పుల‌తో అదరగొట్టిన బ‌న్నీ…ర‌ష్మిక‌

Pushpa 2 : పుష్ప 2 సెకండ్ సింగిల్ వచ్చేసింది - సూసేకీ సాంగ్‌లో రొమాంటిక్ స్టెప్పుల‌తో అదరగొట్టిన బ‌న్నీ…ర‌ష్మిక‌

Nelki Naresh Kumar HT Telugu
May 29, 2024 11:10 AM IST

Pushpa 2 Second Single: పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. సూసేకి అగ్గిర‌వ్వ మాదిరిగా ఉంటాడే నా సామి అంటూ సాగిన ఈ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే శ్రేయా ఘోష‌ల్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌గా మారింది.

పుష్ప 2 సెకండ్ సింగిల్
పుష్ప 2 సెకండ్ సింగిల్

Pushpa 2 Second Single: అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది. సూసేకి అగ్గిర‌వ్వ మాదిర‌గా ఉంటాడే నా సామీ పాట‌ను మేక‌ర్స్ బుధ‌వారం రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్‌లో మాస్ ట్యూన్స్‌తో సాగిన ఈ పాట రిలీజైన కొద్ది క్ష‌ణాల్లోనే ట్రెండింగ్‌గా మారింది. సూసేకీ పాట‌కు శ్రేయ ఘోష‌ల్ ఆల‌పించింది.

చంద్ర‌బోస్ ఈ పాట‌కు సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. సూసేకీ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు.

ఈ పాట‌లో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న కెమిస్ట్రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో ఐకానిక్‌ డ్యాన్స్ స్టెప్పుల‌తో పుష్ప‌రాజ్‌, శ్రీవ‌ల్లి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నారు. దేవిశ్రీప్ర‌సాద్ క్యాచీ ట్యూన్స్‌తో అద‌ర‌గొట్టాడు. తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డం, త‌మిళంతో పాటు మొత్తం ఆరు భాష‌ల్లో సూసేకీ పాట‌ను రిలీజ్ చేశారు. ఆరు భాష‌ల్లో శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను పాడ‌టం గ‌మ‌నార్హం.

పుష్ప ఫ‌స్ట్ సింగిల్ రికార్డ్‌...

పుష్ప 2 మూవీ నుంచి మే 1న పుష్ప‌..పుష్ప అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఉర్రూత‌లూగిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాట‌కు 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ చెప్పారు. అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. రీసెంట్ టైమ్‌లో తెలుగులో అత్య‌ధిక వ్యూస్‌ను ద‌క్కించుకున్న సాంగ్‌గా పుష్ప ఫ‌స్ట్ సింగిల్ నిలిచింది.

అల్లు అర్జున్‌కు నేష‌న‌ల్ అవార్డు...

పుష్ప 2 మూవీకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఆగ‌స్ట్ 15న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. పుష్ప పార్ట్ వ‌న్ భారీ స‌క్సెస్‌గా నిలిచిన నేప‌థ్యంలో సీక్వెల్ కోసం తెలుగు ప్రేక్ష‌కులతో పాటు దేశ‌వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తోన్నారు.

పుష్ప సినిమాలో అస‌మాన న‌ట‌న‌కు గాను అల్లు అర్జున్ నేష‌న‌ల్ అవార్డ్ అందుకోవ‌డంతో సీక్వెల్ అందుకోవ‌డం కూడా ఈ సీక్వెల్‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది.

500 కోట్ల బ‌డ్జెట్‌...

పుష్ప 2 మూవీని దాదాపు 500 కోట్ల‌ బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. తెలుగులో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా పుష్ప 2 రికార్డ్ నెల‌కొల్సింది.

ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌…

పుష్ప 2 మూవీలో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోండ‌గా... సునీల్‌, అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కూడా ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పుష్ప 3 కూడా...

రిలీజ్‌కు ముందే పుష్ప 2 మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను 275 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. పుష్ప 2కు కొన‌సాగింపుగా పుష్ప 3 కూడా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పుష్ప 2 త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, సందీప్ వంగాల‌తో అల్లు అర్జున్ సినిమాలు చేయ‌బోతున్నాడు. అవి పూర్త‌యిన త‌ర్వాతే పుష్ప 3 రానున్న‌ట్లు చెబుతోన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024