Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే స్పెష‌ల్‌ - గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!-the girlfriend movie first look unveiled on eve of rashmika mandanna birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే స్పెష‌ల్‌ - గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే స్పెష‌ల్‌ - గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

Nelki Naresh Kumar HT Telugu
Apr 05, 2024 10:44 AM IST

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్ర‌వారం ది గ‌ర్ల్ ఫ్రెండ్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో 1990 కాలం నాటి అమ్మాయిగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపిస్తోంది.

ర‌ష్మిక మంద‌న్న
ర‌ష్మిక మంద‌న్న

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ది గ‌ర్ల్ ఫ్రెండ్ యూనిట్ అభిమానుల‌కు స్వీట్ స‌ర్‌ప్రైజ్ అందించింది. ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపిస్తోంది. ఆమె డ్రెస్టింగ్ స్టైల్ మొత్తం 1990ల కాలం నాటిని త‌ల‌పిస్తోంది. చేతికి ఓల్డ్ మోడ‌ల్ వాచ్ ధ‌రించి కాలేజీ అమ్మాయిగా ర‌ష్మిక క‌నిపిస్తోంది. ఆమె పెదాల కంటే ముందు క‌ళ్లు చిరున‌వ్వుల‌ను చిందిస్తాయి. ఆమె మాట్లాడ‌టానికి కంటే ముందే ఆ క‌ళ్లు ఎన్నో అంద‌మైన భావాల‌ను ప‌ల‌కిస్తాయి అంటూ ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు పొయెటిక్ క్యాప్ష‌న్ ఇచ్చారు. ర‌ష్మిక మంద‌న్న ది గ‌ర్ల్ ఫ్రెండ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌న్మ‌థుడు త‌ర్వాత‌...

ది గ‌ర్ల్ ఫ్రెండ్ మూవీకి న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చిల‌సౌ సినిమాతో డైరెక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్ ఆ త‌ర్వాత నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2 సినిమా చేశాడు. ఈ సీక్వెల్‌ డిజాస్ట‌ర్ అయ్యింది. దాదాపు మెగాఫోన్‌కు ఐదేళ్ల పాటు దూరంగా ఉన్న రాహుల్ ర‌వీంద్ర‌న్ ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో మ‌ళ్లీ డైరెక్ట‌ర్‌గా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ద‌స‌రా హీరో...

ది గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న‌కు జోడీగా ద‌స‌రా ఫేమ్ దీక్షిత్ శెట్టి న‌టిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో విద్యా కొప్పినీడి, ధీర‌జ్ మొగిలినేని ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ధ‌నుష్‌తో...

ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో వ‌స్తోన్న తెలుగు, త‌మిళ్ బైలింగ్వ‌ల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌ష్మిక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ఆమె స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కంప్లీట్ నార్మ‌ల్ లుక్‌లో ర‌ష్మిక క‌నిపిస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

అలాగే అల్లు అర్జున్‌, సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తోన్న పుష్ప 2లో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్‌తో ర‌ష్మిక మంద‌న్న బిజీగా ఉంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. 2024లో పుష్ప 2తో పాటు ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌, ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు రిలీజ్ కానున్నాయి.

యానిమ‌ల్‌తోస‌క్సెస్‌...

గ‌త ఏడాది యానిమ‌ల్ మూవీతో కెరీర్‌లోనే అతిపెద్ద స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నది ర‌ష్మిక మంద‌న్న‌. ర‌ణ్‌భీర్‌క‌పూర్ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 900 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

దుబాయ్‌లో బ‌ర్త్‌డే...

ర‌ష్మిక మంద‌న్న త‌న బ‌ర్త్‌డేను దుబాయ్‌లో సెల‌బ్రేట్ చేసుకోనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొనున్న‌ట్లు చెబుతోన్నారు. ఫ్యామిలీ స్టార్ ప్ర‌మోష‌న్స్‌తో ఇన్నాళ్లు బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ గురువారం దుబాయ్ చేరుకున్న‌ట్లు చెబుతున్నారు. విజ‌య్, ర‌ష్మిక ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మ ప్రేమ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టివ‌ర‌కు వీరిద్ద‌రు పెద‌వి విప్ప‌లేదు.

IPL_Entry_Point