Gama Awards: దుబాయ్‌లో గామా అవార్డ్స్ ఈవెంట్ - గెస్ట్‌లుగా బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌?-gama telugu movie awards 2024 event to be held on march 3rd at dubai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gama Awards: దుబాయ్‌లో గామా అవార్డ్స్ ఈవెంట్ - గెస్ట్‌లుగా బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌?

Gama Awards: దుబాయ్‌లో గామా అవార్డ్స్ ఈవెంట్ - గెస్ట్‌లుగా బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌?

Nelki Naresh Kumar HT Telugu
Feb 24, 2024 06:29 PM IST

Gama Awards: గామా తెలుగు మూవీ అవార్డ్స్ నాలుగ‌వ ఎడిష‌న్ ఈవెంట్ మార్చి 3న దుబాయ్‌లో జ‌రుగ‌నుంది. ఈ అవార్డ్స్ ఈవెంట్‌కు టాలీవుడ్‌లో అగ్ర హీరోల‌తో పాటు ద‌ర్శ‌కులు హాజ‌రుకానున్నారు.

గామా తెలుగు మూవీ అవార్డ్స్
గామా తెలుగు మూవీ అవార్డ్స్

Gama Awards 2024: గామా తెలుగు మూవీ అవార్డ్స్ నాలుగవ ఎడిషన్ మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌లో ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఎం.ఎం కీరవాణి, గేయ‌ర‌చ‌యిత చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’అవార్డును అంద‌జేయ‌బోతున్నారు. దివంగ‌త గాయ‌కుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను సీనియ‌ర్ సింగ‌ర్ మనోకి అంద‌జేయ‌బోతున్నారు. గామా అవార్డ్స్ 4వ ఎడిష‌న్‌ను ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సార‌థ్యంలో చైర్మన్ కేసరి త్రిమూర్తులు నిర్వహించబోతున్నారు.

క‌ర్టెన్ రైజ‌ర్‌...

గామా అవార్డు వేడుక‌కు సంబంధించిన‌ కర్టెన్ రైజర్ కార్యక్రమం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతితో పాటు గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ హాజ‌ర‌య్యారు.

మూడేళ్లు అవార్డ్స్ ఇవ్వ‌లేదు...

కొవిడ్‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల గ‌త మూడేళ్ల పాటు గామా అవార్డ్స్ అంద‌జేయ‌లేద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి అన్నాడు. కానీ ఈసారి టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నామ‌ని తెలిపాడు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చాలా జెన్యూన్ గా గామా అవార్డు వేడుకను నిర్వహించబోతున్నామ‌ని జ్యూరి మెంబ‌ర్, డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య చెప్పాడు. తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉంద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘు కుంచే తెలిపాడు.

బెస్ట్ యాక్ట‌ర్‌...

2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలకు అవార్డుల‌ను అంద‌జేయ‌బోతున్నారు. బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నాం.

ఈటీవీలో టెలికాస్ట్‌...

వంద‌లాది తెలుగు, తమిళ, మళయాళ‌ సినీ ప్రేమికుల మధ్యలో ఈ అవార్డ్స్ ఈవెంట్ జ‌రుగ‌నుంద‌ని గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ తెలిపాడు. నేషనల్ అవార్డ్ విన్నర్అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప‌లువురు హీరోలు, సెల‌బ్రిటీల‌ను అ అవార్డు వేడుక‌కు ఆహ్వానించామ‌ని చెప్పాడు. అవార్డు ఫంక్షన్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంద‌ని సౌర‌భ్ చెప్పాడు.గామా అవార్డ్స్ ఈవెంట్‌కు డింపుల్ హయతి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని నిర్వ‌హ‌కులు చెప్పారు.

సుకుమార్ చీఫ్ గెస్ట్‌...

గామా అవార్డ్స్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, గాయకులు మనో, ధనుంజయ్ రానున్నారు.

IPL_Entry_Point

టాపిక్