AP TS Weather : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు- నేడు, రేపు తేలికపాటి వర్షాలు
AP TS Weather : ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అంచనా వేసింది.
AP TS Weather : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని(AP TS Weather ) పలు ప్రాంతాల్లో వర్షాలు(Rains) కురుస్తాయని ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు దక్షిణ తెలంగాణలో(Telangana) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ మీదుగా రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో ఏపీలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో మంచు, పగటిపూట ఎండలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో తేలికపాటు జల్లులు
తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండ్రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather) తెలిపింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గత మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అవుతున్నాయి. ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండగా... ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాత్రిపూట సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల పైకి మేఘాలు
నేటి నుంచి 26 వరకు తెలంగాణలో తేలికపాటి జల్లులు(Light Showers) పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని తెలిపారు. దక్షిణ తెలంగాణ పరిసరాల్లో తుపాను తరహా సర్కిలేషన్ ఏర్పడిందన్నారు. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, ఇది దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల పైకి మేఘాలు విస్తరిస్తున్నాయని, పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో(Bay of Bengal) గాలి వేగం గంటకు 11 నుంచి 18 కిలోమీటర్లుగా ఉందన్నారు. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో గాలి సుడి లాగా తిరుగుతుందన్నారు. ఈ గాలి సర్కులేషన్ లో తెలుగు రాష్ట్రాల వేపు వస్తుందన్నారు. దీంతో తెలంగాణలో గాలి వేగం గంటకు 7 నుంచి 13 కిలోమీటర్లు కాగా, ఏపీలో గాలి వేగం గంటకు 11 నుంచి 16 కిలోమీటర్లుగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.