Amitabh Bachchan Black: థియేటర్లలో రిలీజైన 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన అమితాబ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ
Amitabh Bachchan Black: అమితాబ్ బచ్చన్ బ్లాక్ మూవీ థియేటర్లలో రిలీజైన 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Amitabh Bachchan Black: ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్లలో రిలీజైన పదిహేను, ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్నాయి. కానీ అమితాబ్ బచ్చన్ బ్లాక్ మూవీ మాత్రం ఏకంగా థియేటర్లలో రిలీజైన 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 4 న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. బ్లాక్ మూవీ రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైన ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలో బ్లాక్ మూవీ రిలీజ్ కావడం ఆనందంగా ఉందని తెలిపాడు.
సంజయ్ లీలా భన్సాలీ...
బ్లాక్ మూవీకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2005 ఫిబ్రవరి 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 66 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 2005లో అత్యధిక వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ మూవీలో ఒకటిగా నిలిచింది. ఇన్‌స్పైరింగ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్‌తో పాటు రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించింది.
అవార్డుల పంట
బ్లాక్ మూవీకి పలు అవార్డులను గెలుచుకొని చరిత్రను సృష్టించింది. బ్లాక్ మూవీకి రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ హిందీ సినిమాగా అవార్డును గెలుచుకున్నది. అలాగే ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే పదకొండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఫిలింఫేర్ చరిత్రలో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా బ్లాక్ నిలిచింది. నాలుగు ఫిలింఫేర్ అవార్డులను మాత్రమే ఈ మూవీ అందుకున్నది. బాలీవుడ్ టాప్ 100 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. టర్కీ భాషలో బ్లాక్ మూవీ రీమేకైంది. కొరియన్‌లోకి ఈ మూవీని డబ్ చేశారు.
అమితాబ్‌బచ్చన్ బ్లాక్ మూవీ స్టోరీ
బ్లాక్ మూవీలో దేవరాజ్ సహాయ్ గా అమితాబ్‌బచ్చన్ అసమాన అభినయంతో మెప్పించారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాదిగా బ్లాక్ మూవీ నిలిచింది. మిచెల్ పాత్రలో రాణి ముఖర్జీ నటించింది. హెలెన్ కిల్లర్ జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించాడు. మిచెల్ ఓ అంధురాలు. చిన్న వయసులోనే కంటిచూపును కోల్పోతుంది. ఆమెకు దేవరాజ్ సహాయ్ టీచర్‌గా వస్తాడు. మిచెల్ జీవితాన్ని చక్కదిద్దుతాడు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన దేవరాజ్ ఆల్జీమర్స్ బారిన పడటంతో వృద్ధాప్యంలో అతడికి మిచెల్ ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ మూవీ కథ.
కల్కిలో...
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తెలుగులో కల్కి 2898 ఏడీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో రజనీకాంత్ వెట్టైయాన్‌లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కలిసి నటిస్తోన్న మూవీ ఇది. టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అమితాబ్ బచ్చన్ బిజీగా ఉన్నాడు.