Aa Okkati Adakku OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి అల్లరి నరేష్ కామెడీ మూవీ - ఆ ఒక్కటి అడక్కు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. రెండు ఓటీటీలలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు థియేటర్లలో రిలీజైన నెల రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాతో మల్లి అంకం డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
మ్యాట్రిమోనీ మోసాలతో...
మ్యాట్రిమోనీల బారిన పడి యువత ఎలా మోసపోతున్నారనే సీరియస్ ఇష్యూకు కామెడీని జోడించి తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. పాయింట్ యూనివర్సల్ అయినా అల్లరి నరేష్ సినిమాల్లో ఉండే కామెడీ ఇందులో లోపించడంలో యావరేజ్‌గా నిలిచింది.
రెండు ఓటీటీలలో...
ఆ ఒక్కటి అడక్కు మూవీ నెల రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. మే 31న ఆ ఒక్కటి అడక్కు మూవీ ఓటీటీ రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మే లాస్ట్ వీక్‌లో ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. రెండు ఓటీటీలలో ఒకే రోజు రిలీజ్ అవుతోందా? కొద్ది రోజుల గ్యాప్‌తో వస్తుందా? అన్నదే అప్పుడే తేలనుంది.
మళ్లీ కామెడీ రూట్‌లో...
సెకండ్ ఇన్నింగ్స్‌లో సీరియస్ కథాంశాలను ఎంచుకొని హీరోగా నాంది, ఉగ్రంతో పాటు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు చేశాడు అల్లరి నరేష్. చాలా రోజుల తర్వాత ఆ ఒక్కటి అడక్కుతో కామెడీ జోనర్‌ను టచ్ చేశాడు.
మూవీ కథ ఇదే...
గణపతి (అల్లరి నరేష్) ఓ ప్రభుత్వ ఉద్యోగి. 30 ఏళ్లు దాటినా పెళ్లికాదు. అతడికి వచ్చిన పెళ్లి సంబంధాలన్ని రిజెక్ట్ అవుతుంటాయి. ఓ సమస్య కారణంగా సిద్ధిని (ఫరియా అబ్దుల్లా) తన ప్రియురాలిగా కుటుంబసభ్యులకు పరిచయం చేస్తాడు గణపతి. మ్యాట్రిమెనీ పేరుతో అబ్బాయిలకు వలవేస్తూ మోసాలకు పాల్పడుతుందంటూ సిద్ధి గురించి పేపర్లలో న్యూస్ వస్తుంది? సిద్ధి గురించి వచ్చిన ఆ వార్త నిజమేనా? ఆ సమస్య నుంచి ఆమెను గణపతి ఎలా గట్టెక్కించాడు? గణపతి పెళ్లి ప్రపోజల్‌ను మొదల తిరస్కరించిన సిద్ధి ఆ తర్వాత అతడితో ఎలా ప్రేమలో పడిందన్నదే ఈ మూవీ కథ. పెళ్లి వయసు దాటినా సంబంధాలు కుదరక అబ్బాయిలు పడే ప్రస్టేషన్‌ను దర్శకుడు ఈ మూవీలో వినోదాత్మకంగా చూపించాడు. అయితే అదే స్థాయిలో సినిమా కామెడీ మొత్తం వర్కవుట్ కాలేదు.
ఆ ఒక్కటి అడక్కు కలెక్షన్స్
మిక్సడ్ టాక్‌తో సంబంధం లేకుండా ఆ ఒక్కటి అడక్కు మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఏడు రోజుల్లో ఈ మూవీ 5.95 గ్రాస్ కలెక్షన్స్, 2.70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. నాలుగున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో రెండు కోట్ల వరకు వసూళ్లను రాబట్టాల్సివుంది. గురు, శుక్రవారాల్లో కేవలం పది లక్షలు మాత్రమే ఈ సినిమాకు వసూళ్లు వచ్చాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చలమల్లి పేరుతో ఓ ప్రయోగాత్మక మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.