OTT Horror Films: రీసెంట్‍గా ఓటీటీల్లోకి వచ్చిన మూడు హారర్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Horror Films: ఓటీటీల్లో గత పది రోజుల్లో మూడు హారర్ సినిమాలు అడుగుపెట్టాయి. ఇందులో రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. ఓ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ కూడా ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఓ మెలికతో అడుగుపెట్టింది.
ఓటీటీల్లో హారర్ చిత్రాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ జానర్ మూవీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లోకి ఎప్పుడెప్పుడు నయా హారర్ చిత్రాలు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో గత 10 రోజుల్లో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి మూడు హారర్ చిత్రాలు వచ్చాయి. రెండు తమిళ హారర్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ స్త్రీ2 రెంటల్ విధానంలో ఓటీటీలోకి వచ్చింది. గత 10 రోజుల్లో ఓటీటీలోకి వచ్చిన మూడు హారర్ చిత్రాలు ఇవే..
పేచి
తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ‘పేచి’ సెప్టెంబర్ 20వ తేదీన రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ చిత్రం అడుగుపెట్టింది. గాయత్రి శంకర్, బాలా శరవణన్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ అయింది. దేవ్ రామ్‍నాథ్, ప్రీతి నెడుమారన్, మగేశ్వరన్, సీనయమ్మాల్, కీరోల్స్ చేశారు. ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రానికి రామచంద్రన్ బీ దర్శకత్వం వహించారు.
తమిళనాడులోని కొల్లిమలై హిల్స్ అటవీ ప్రాంతంలో పేచి మూవీ కథ సాగుతుంది. ట్రెక్కింగ్‍కు వెళ్లే ఫ్రెండ్స్ గ్రూప్.. పేచి అనే దెయ్యాన్ని మళ్లీ లేపుతారు. వారు ఆ దెయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారనేదే ఈ మూవీ స్టోరీగా ఉంటుంది.
డిమోంటి కాలనీ 2
హారర్ థ్రిల్లర్ చిత్రం డిమోంటి కాలనీ 2 జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం వారం తర్వాత తెలుగులోనూ వచ్చింది. రెండు భాషల్లో మంచి కలెక్షన్లు సాధించింది.
డిమోంటి కాలనీ మూవీకి తొమ్మిదేళ్ల తర్వాత సీక్వెల్‍గా ఈ చిత్రం వచ్చింది. హారర్ ఎలిమెంట్లతో గ్రిప్పింగ్ నరేషన్‍తో డైరెక్టర్ జ్ఞానముత్తు మెప్పించారు. దీంతో డిమోంటి కాలనీ 2 మంచి సక్సెస్ అయింది. జీ5 ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
స్త్రీ 2.. రెంటల్ పద్ధతిలో..
బాలీవుడ్ హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ 2’ సంచలన బ్లాక్‍బస్టర్ అయింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ హిందీ సీక్వెల్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.850కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకొని చాలా రికార్డులను బద్దలుకొట్టింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కించారు.
స్త్రీ 2 చిత్రం ఈ వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. అయితే, రెంటల్ విధానంలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. దీంకతో ప్రస్తుతం రెంట్ చెల్లిస్తేనే ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. అక్టోబర్ రెండో వారంలో ఈ మూవీకి రెంట్ తొలగిపోయే అవకాశం ఉంది.
స్త్రీ 2 సినిమా థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది. మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. 2018లో వచ్చి హిట్ అయిన స్త్రీకి సీక్వెల్‍గా ఆరేళ్ల తర్వాత ఈ మూవీ వచ్చింది. స్త్రీ 2 ఏకంగా భారీ కలెక్షన్లతో రికార్డులను బద్దలుకొట్టి బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ అయింది.