OTT Horror Thriller: రెండు ఓటీటీల్లోకి రానున్న ట్విస్టులతో కూడిన హారర్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Pechi Horror Thriller OTT Release Date: పేచి సినిమా రెండు ఓటీటీల్లోకి రానుంది. ఈ తమిళ హారర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
గాయత్రి శంకర్, బాలా శరవణన్ ప్రధాన పాత్రల్లో పేచి చిత్రం వచ్చింది. ఈ తమిళ మూవీ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్‌తో ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. థియేటర్లలో ఈ చిత్రానికి మిక్స్ట్ టాక్ వచ్చింది. మోస్తరు కలెక్షన్లను ఈ మూవీ దక్కించుకుంది. ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓటీటీ డేట్ ఖరారైంది.
పేచి చిత్రం స్ట్రీమింగ్ తేదీ కన్ఫర్మ్ అయింది. రెండు ఓటీటీల్లో ఈ చిత్రం అడుగుపెట్టనుంది. అంచనాల కంటే ఆలస్యంగా ఈ మూవీ ఓటీటీల్లోకి అడుగుపెడుతోంది.
రెండో ఓటీటీల్లో ఎప్పుడు?
పేచి సినిమా ఈ శుక్రవారం సెప్టెంబర్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మూవీ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
భయం, ప్రేమను చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఈ మూవీ టీమ్ ట్వీట్ చేసింది. “ఉత్సాహం కలిగించే విషయం! సెప్టెంబర్ 20వ తేదీన పేచి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రేమ, భయాలు ఉన్న గ్రిప్పింగ్ జర్నీ కోసం సిద్ధంగా ఉండండి” అని ఈ చిత్రాన్ని నిర్మించిన వెయిలోన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పేచి చిత్రం తెలుగు వెర్షన్ వస్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి తెలుగులో కూడా వస్తుందా.. తమిళంలో ఒక్కటే పేచి స్ట్రీమింగ్ అవుతుందా అనేది చూడాలి.
పేచి మూవీకి రామచంద్రన్ బీ దర్శకత్వం వహించారు. ట్రెక్కింగ్‍కు వెళ్లిన ఫ్రెండ్ గ్రూప్‍ను దెయ్యం వెంబడించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రాన్ని గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారు దర్శకుడు. ఈ మూవీలో గాయత్రి, శరవణన్‍తో పాటు దేవ్ రామ్‍నాథ్, ప్రీతి నెడుమారన్, జనా, మగేశ్వరన్, సీనయమ్మాల్, మురళీ రామ్ కీలకపాత్రలు పోషించారు.
పేచి చిత్రాన్ని వెయిలోన్ ఎంటర్‌టైన్‍మెంట్స్, వీరస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశాయి. ఈ మూవీకి రాజేశ్ మురుగేశన్ సంగీతం అందించారు. పార్థిబన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో విజువల్స్ గురించి ప్రశంసలు దక్కాయి.
పేచి మూవీ స్టోరీలైన్
తమిళనాడులోని కొల్లిమలై హిల్స్‌లో పేచి మూవీ సాగుతుంది. కొందరు ఫ్రెండ్స్ కొల్లిమలై హిల్స్‌కు ట్రెక్కింగ్‍కు వెళతారు. సరదగా సమయం గడుపుతుంటారు. ఈ క్రమంలో అరణ్మనై అడవుల్లో ఓ ప్రమాదకర ప్రదేశానికి వెళతారు. అక్కడ ఉండే పేచి అనే దెయ్యం మళ్లీ లేచేందుకు కారణం అవుతారు. ఆ భయంకరమైన అడవిలో ఆ దెయ్యం నుంచి వారు ఎలా బయటపడ్డారనే విషయం పేచి చిత్రంలో ప్రధానంగా ఉంటుంది.
ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఇటీవలే నంబన్ ఒరువన్ వంత పిరగు మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. సెప్టెంబర్ 13న ఈ కామెడీ డ్రామా మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీకి ఆనంత్ రామ్ దర్శకత్వం వహించారు.