OTT Comedy Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Nanban Oruvan Vantha Piragu OTT: ‘నంబన్ ఒరువన్ వంత పిరగు’ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ బడ్డీ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ తమిళ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టనుంది.
స్నేహితుల మధ్య సరదాగా సాగే కమింగ్ ఆఫ్ ఏజ్ బడ్డీ కామెడీ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మంచి సక్సెస్ అవుతాయి. అదే కోవలోకి చెందుతుంది 'నంబన్ ఒరువన్ వంత పిరగు' చిత్రం. ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ తమిళ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే వసూళ్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
‘నంబన్ ఒరువన్ వంత పిరగు’ మూవీ సెప్టెంబర్ 13వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (సెప్టెంబర్ 9) అధికారికంగా వెల్లడించింది.
నంబన్ ఒరువన్ వంత పిరగు చిత్రంలో అనంత్ రామ్, భవానీ శ్రీ, కుమార్ వేల్, లీల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనంత్ రామే దర్శకత్వం వహించారు. ఓ యువకుడు స్నేహితలతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం, సంతోషం అంటే ఏంటో గుర్తించేందుకు పరితపించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని ఎంగేజింగ్‍గా తెరకెక్కించడంలో అనంత్ సక్సెస్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
నంబన్ ఒరువన్ వంత పిరగు మూవీకి ఏహెచ్ కాసిఫ్ సంగీతం అందించారు. మసాలా పాప్‍కార్న్, వైట్ ఫెదర్ పతాకాలపై ఐశ్వర్య ఎం, సుధ నిర్మించారు. ఈ చిత్రానికి తమిళ సెల్వన్ సినిమాటోగ్రఫీ చేయగా.. ఫెన్నీ ఒలివర్ ఎడిటింగ్ చేశారు.
స్టోరీలైన్
సొంత ఊరికి బయలుదేరిన ఆనంద్ (అనంత్ రామ్) తన జీవితంలో జరిగిన విషయాలను ఓ వ్యక్తికి చెబుతారు. తన స్నేహితులతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటారు. 8 చాప్టర్లుగా ఈ స్టోరీలు ఉంటాయి. తన జీవితంలోని వివిధ దశల్లో కలిసిన స్నేహితులు, వారితో బంధాలను ఆనంద్ వివరిస్తాడు. సంతోషం అంటే ఏంటి.. హ్యాపీగా ఉన్నానా అంటూ అతడు ప్రశ్నించుకుంటాడు. అసలు ఆనంద్ గతమేంటి.. ఏం జరిగింది.. స్నేహితులతో బంధం ఎలా సాగింది.. అసలైన సంతోషాన్ని అతడు గుర్తించాడా? అనే విషయాలు నంబన్ ఒరువన్ వంత పిరగు చిత్రంలో ఉంటాయి. ఈ మూవీకి ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా హృదయాన్ని తాకేలా ఈ చిత్రం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.