Rakul Preet Singh Marriage: ‘ఎకో ఫ్రెండ్లీ’గా వివాహం చేసుకోనున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏంటిది?-rakul preet singh marriage with jackky bhagnani wedding to be eco friendly in goa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Singh Marriage: ‘ఎకో ఫ్రెండ్లీ’గా వివాహం చేసుకోనున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏంటిది?

Rakul Preet Singh Marriage: ‘ఎకో ఫ్రెండ్లీ’గా వివాహం చేసుకోనున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏంటిది?

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 13, 2024 04:01 PM IST

Rakul Preet Singh Eco Friendly Marriage: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్, వేదిక ఇప్పటికే ఖరారయ్యాయి. తన బాయ్‍ఫ్రెండ్ జాకీ భగ్నానీని ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ తరుణంలో ఈ పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.

Rakul Preet Singh Marriage: ‘ఎకో ఫ్రెండ్లీ’గా వివాహం చేసుకోనున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏంటిది?
Rakul Preet Singh Marriage: ‘ఎకో ఫ్రెండ్లీ’గా వివాహం చేసుకోనున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏంటిది?

Rakul Preet Singh Marriage: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో ఆమె వివాహం జరగనుంది. ఫిబ్రవరి 21వ తేదీన గోవా వేదికగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఇద్దరూ పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. షాపింగ్ చేస్తూ కూడా కనిపించారు. ఈ తరుణంలో రకుల్ - జాకీ వివాహంపై ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.

రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ వివాహం ఎకో-ఫ్రెండ్లీ (పర్యావహణహితం)గా జరగనుందని తెలుస్తోంది. పర్యావరణానికి ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వివాహం చేసుకోవాలని రకుల్ నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా వీరి పెళ్లిలో ఎలాంటి టపాసులు (ఫైర్ క్రాకర్స్) కాల్చరని సంబంధిత వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. అలాగే, పేపర్ వేస్ట్‌ను తగ్గించేందుకు ఎక్కువ మందికి ఆహ్వానాన్ని డిజిటల్ రూపంలోనే ఇవ్వాలని నిర్ణయించారట.

మొక్కలు నాటడం కూడా..

టపాసులు కాల్చకుండా.. వీలైంత పేపర్ వ్యర్థాలు కాకుండా పెళ్లి చేసుకోవాలని రకుల్ - జాకీ డిసైడ్ అయ్యారు. అలాగే, పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మొక్కలు కూడా నాటనున్నారని తెలిసింది. పెళ్లి సమయంలో కర్బన ఉద్గారాలు ఎంత వెలువడతాయో కొలిచేందుకు ఎక్స్‌పర్ట్‌లను కూడా ఉంచనున్నారని తెలుస్తోంది.

“పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఉత్పత్తి అయ్యే కర్బన ఉద్గారాలను వారు (సిబ్బంది) కొలుస్తారు. ఆ తర్వాత అందుకు ఎన్ని మొక్కలు నాటాల్సి ఉంటుందో వారు చెబుతారు. ఇదో ప్రత్యేకమైన చర్య. ఆ మొక్కలను పెళ్లి అయ్యాక వారిద్దరూ నాటుతారు. అదే రోజు కానీ.. ఆ తర్వాతి రోజు కానీ ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది” అని సంబంధిత వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది.

రకుల్ - జాకీ పెళ్లి సంబరాలు గోవాలో ఫిబ్రవరి 19వ తేదీనే మొదలవుతాయి. సంగీత్, హల్దీ సహా మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన వీరి వివాహం జరగనుంది.

వీరి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇటీవలే సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. పింక్, బ్లూ కలర్ షేడ్లలో ఈ ఇన్వినేషన్ ఆకర్షణీయంగా ఉంది.

ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య రకుల్, జాకీ భగ్నానీ వివాహం జరగనుంది. సినీ ఇండస్ట్రీని నుంచి తక్కువ మందే హాజరవుతారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత రిసెప్షన్ గురించి ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.

ప్రముఖ డిజైనర్ తరుణ్ తహుల్లానీ స్టూడియో నుంచి రకుల్ ప్రీత్ సింగ్ బయటికి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే, జాకీ భగ్నానీ కూడా అదే స్టూడియో వద్ద కనిపించారు. దీంతో తరుణ్ డిజైన్ చేసిన దుస్తులను వీరిద్దరూ పెళ్లి వేడుకలో ధరించనున్నారని తెలుస్తోంది. మనోష్ మల్హోత్రా, సబ్యసాచి క్రియేషన్ల నుంచి కూడా కొన్ని ఔట్‍ఫిట్‍లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

రకుల్, జాకీ సుమారుగా మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అప్పుడే తమ రిలేషన్‍ను బయటపెట్టారు. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను కూడా కొన్ని సార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఆయలాన్ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2తో పాటు మరో బాలీవుడ్ చిత్రం కూడా చేస్తున్నారు. టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందిన రకుల్.. రెండేళ్ల నుంచి ఎక్కువగా బాలీవుడ్‍పై ఫోకస్ పెట్టారు.

Whats_app_banner