Rakul Preet wedding invitation: రకుల్‌ప్రీత్ పెళ్లి ఆ రోజే.. ఇన్విటేషన్ కార్డు చూశారా?-rakul preet wedding invitation tollywood actress to get marry jackky bhagnani on february 21st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Wedding Invitation: రకుల్‌ప్రీత్ పెళ్లి ఆ రోజే.. ఇన్విటేషన్ కార్డు చూశారా?

Rakul Preet wedding invitation: రకుల్‌ప్రీత్ పెళ్లి ఆ రోజే.. ఇన్విటేషన్ కార్డు చూశారా?

Hari Prasad S HT Telugu

Rakul Preet wedding invitation: టాలీవుడ్, బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ పెళ్లి ఏ రోజు జరగబోతోందో తేలిపోయింది. తాజాగా ఆమె వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ పెళ్లి.. ఇన్విటేషన్ కార్డు వైరల్ (Instagram)

Rakul Preet wedding invitation: ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగి.. తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతోంది. తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీని ఆమె పెళ్లాడనుంది. వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో జరగనుంది. రకుల్, జాకీ పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రకుల్ ప్రీత్ పెళ్లి ఇన్విటేషన్

రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ పింక్‌విల్లా బయట పెట్టింది. ఫిబ్రవరి 21న వీళ్ల పెళ్లి గోవాలో జరగబోతోందని ఆ ఇన్విటేషన్ ద్వారా స్పష్టమవుతోంది. సన్నిహతులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే వీళ్ల పెళ్లి పనులు జోరుగా సాగుతున్నట్లు కూడా ఆ రిపోర్టు వెల్లడించింది. వీళ్ల ఇన్విటేషన్ కూడా చాలా అందంగా ఉంది.

పింక్, బ్లూ కలర్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఇన్విటేషన్ ఆకట్టుకుంటోంది. బీచ్ పక్కన ఉన్న మండపం ఫొటో, దానిపై "ఫేరాస్, బుధవారం 21 ఫిబ్రవరి 2024" అని రాసి ఉంది. నిజానికి వీళ్లు మొదట్లో తమ పెళ్లిని మిడిల్ ఈస్ట్ లో చేసుకుందామని భావించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ మధ్య సెలబ్రిటీలందరూ వేరే దేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ పెళ్లి వేదికను గోవాకు మార్చారు. గతేడాది డిసెంబర్ లోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ ఇద్దరికీ గోవా సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందన్న ఉద్దేశంతోనే రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ అక్కడ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రకుల్, జాకీ లవ్ స్టోరీ

రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీళ్లు అక్టోబర్, 2021లో తమ మధ్య ఉన్న బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు. వీళ్ల పెళ్లి చాలా కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరగనుంది. ఆ రోజు కోసం ఈ ఇద్దరూ ఎంతో ప్రత్యేకంగా కనిపించాలని నిర్ణయించుకున్నారు. సబ్యసాచి క్రియేషన్, మనీష్ మల్హోత్రా లేదంటే తరుణ్ తహ్లియానీలలో ఒకరి దుస్తుల్లో రకుల్, జాకీ పెళ్లి పీటలపై కూర్చోనున్నారు.

2009లో కన్నడ సినిమా గిల్లీ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి రకుల్ అడుగు పెట్టింది. ఆ తర్వాత 2011లో కెరటం అనే మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2014లో యారియా అనే మూవీ ద్వారా బాలీవుడ్ కు వెళ్లింది. 2021లో కొండపొలం మూవీతో చివరిసారి పూర్తిస్థాయిలో ఓ తెలుగు సినిమాలో రకుల్ కనిపించింది. ఈ మధ్యే తమిళ మూవీ అయలాన్ లో నటించింది. ఇండియన్ 2, మేరీ పత్నీకా రీమేక్ మూవీస్ లో నటిస్తోంది.

2022 నుంచి ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తోంది రకుల్. 2022లో రన్‌వే 34, అటాక్, డాక్టర్ జి, కట్‌పుత్లీ, థాంక్ గాడ్ లాంటి సినిమాల్లో ఆమె కనిపించింది. పెళ్లి తర్వాత రకుల్ తన మూవీ కెరీర్ కొనసాగిస్తుందా లేదా చూడాలి.