Rakul Preet Singh: రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అవుతుందా?-rakul preet singh plays surpanakha role in nitesh tiwari ramayan nitesh tiwari thought rakul is perfect for surpanakha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Singh: రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అవుతుందా?

Rakul Preet Singh: రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అవుతుందా?

Sanjiv Kumar HT Telugu
Feb 11, 2024 01:45 PM IST

Rakul Preet Singh Role In Ramayana: బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న రామాయణం సినిమాలో ఫిట్‌నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్నట్లు టాక్ వస్తోంది. అందులో ఓ మంచి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అవుతుందా?
రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అవుతుందా?

Rakul Preet Singh In Ramayana: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న సినిమా రామాయణం. ఈ సినిమాను హిందీ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. రామాయణం సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ కనిపిస్తే సీతగా సాయి పల్లవి నటించనుందని మొన్నటి వరకు టాక్ నడిచింది. కానీ, ఈ మధ్య సాయి పల్లవి స్థానంలో సీతగా దేవర భామ జాన్వీ కపూర్ నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

yearly horoscope entry point

ఇదిలా ఉంటే త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న రామాయణం సినిమాను దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది అంటే 2025లో ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని సమాచారం. నితేష్ తివారీ రామాయణం సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ ఫేమ్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

కేకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ రోల్‌లో విజయ్ సేతుపతి అలరించున్నాడు. అయితే, తాజాగా ఈ రామాయణం సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. రామాయణం సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ రోల్ చేయనుందని సమాచారం. ఇందులో రావణుడికి చెల్లెలుగా శుర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకోవాలనుకుంటున్నాడట డైరెక్టర్ నితీష్ తివారీ. ఇప్పటికే రకుల్ ప్రీత్‌తో రామాయణం టీమ్ చర్చలు జరిపిందట.

"రామాయణంలో శూర్పణఖ పాత్ర కోసం రకుల్ ప్రీత్, నితేష్ తివారీ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. ఈ పాత్రలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రామాయణంలో రావణుడితోపాటు శూర్పణఖ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది" అని బాలీవుడ్ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ ఇప్పటికే లుక్ టెస్ట్‌లో కూడా పాల్గొందట. తాను అనుకున్నట్లుగానే శూర్పణఖ పాత్రలో రకుల్ బాగా సెట్ అయిందని డైరెక్టర్ నితేష్ భావిస్తున్నాడని సమాచారం.

చూస్తుంటే రామాయణం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే యష్‌కు రకుల్ చెల్లెలుగా నటించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి ఇతిహాస సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు. కాబట్టి, రామాయణం సినిమాలో రకుల్ నటించేందుకు ఉత్సాహంగా ఉందని బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నటించే తొలి సినిమా రామాయణం అవుతుందని తెలుస్తోంది.

కాగా రామాయణం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. మే నెలలో సన్నీ డియోల్ పార్ట్‌ను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అలాగే జులైలో హీరో యష్‌తో సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. యష్ పార్ట్ వరకు రామాయణం తొలి భాగంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. 2025 సంవత్సరంలో దివాళి కానుకగా రామాయణం తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా డైరెక్టర్ నితేష్ తివారీ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.

ఇదిలా ఉంటే రామాయణం సినిమాలో సీతగా ముందు అలియా భట్‌ను తీసుకోవాలని దర్శకుడు నితేష్ తివారీ భావించారట. కానీ, ఇతర ప్రాజెక్ట్స్‌తో అలియా భట్ బిజీగా ఉండటంతో సాయి పల్లవిని అనుకున్నారు. కానీ, ఇటీవల ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను సీతగా అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ, ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Whats_app_banner