తెలుగు న్యూస్ / ఫోటో /
గోల్డెన్ గౌన్‍లో మైమరిపించిన రకుల్.. పెళ్లికి సిద్ధమవుతున్న బ్యూటీ!
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టైలిష్ లుక్‍తో అదరగొట్టారు. లేటెస్ట్ ఫొటోషూట్‍లో గోల్డెన్ గౌన్‍లో మైమరింపించారు. వీకెండ్ ట్రీట్‍గా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
(1 / 6)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ ట్రైండీగా.. స్టైలిష్ ఔట్‍ఫిట్‍లతో ఆకట్టుకుంటారు. చీర నుంచి మోడ్రన్ డ్రెస్ వరకు ఏ ఔట్‍ఫిట్‍లో అయినా పర్‌ఫెక్ట్ లుక్‍తో కనిపిస్తారు. తాజాగా ఈ అందాల భామ బ్లాక్, గోల్డెన్ గౌన్‍లో తళుక్కుమన్నారు. (Instagram/@rakulpreet)
(2 / 6)
డిఫరెంట్ డిజైన్‍తో ఉన్న ఈ డ్రెస్ ధరించి అట్రాక్టివ్ లుక్‍తో రకుల్ ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను వీకెండ్ ట్రీట్‍లా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. స్టార్స్, డ్రీమ్స్‌ను ఛేజ్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. (Instagram/@rakulpreet)
(3 / 6)
ప్రముఖ డిజైనింగ్ హౌస్ ఫల్గునీ షేన్ పీకాక్ డిజైన్ చేసిన ఈ గ్లామరస్ గౌన్‍లో రకుల్ ప్రీత్ సింగ్ మరింత అట్రాక్ట్ చేశారు. గోల్డ్ షిమ్మెరింగ్ ప్యాటర్న్ ఉన్న బ్లాక్ ఫ్యాబ్రిట్, ఆఫ్ ది షోల్డర్ నెక్‍లైన్‍తో ఈ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది. (Instagram/@rakulpreet)
(4 / 6)
మరోవైపు, రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీన ఆమె వివాహం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. (Instagram/@rakulpreet)
(5 / 6)
తన బాయ్ ఫ్రెండ్ రాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకోనున్నారు. గోవా వేదికగా వీరి పెళ్లి జరుగుతుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులను రకుల్ మొదలుపెట్టారని తెలుస్తోంది.(Instagram/@rakulpreet)
ఇతర గ్యాలరీలు