Rakul Preet Singh: వినూత్నమైన కార్యక్రమంతో మనసులను గెలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్-rakul preet singh jackky bhagnani decided to plants on name of guest who attended their marriage in goa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Singh: వినూత్నమైన కార్యక్రమంతో మనసులను గెలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: వినూత్నమైన కార్యక్రమంతో మనసులను గెలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 06, 2024 11:17 PM IST

Rakul Preet Singh - Jackky Bhagnani: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గత నెలలో పెళ్లాడారు. ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇది అందరి మనసులను గెలుస్తోంది.

Rakul Preet Singh: వినూత్నమైన కార్యక్రమంతో మనసులను గెలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh: వినూత్నమైన కార్యక్రమంతో మనసులను గెలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఫిబ్రవరి 21వ తేదీన గ్రాండ్‍గా జరిగింది. తన ప్రియుడు, నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకున్నారు. రకుల్, జాకీ పెళ్లి గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‍లో ఘనంగా జరిగింది. ఈ వివాహాన్ని వారు పర్యావరణ హితం (ఎకో ఫ్రెండ్లీ)గా చేసుకున్నారు. అలాగే, పర్యావరణానికి మేలు చేసేందుకు వారు ఓ కార్యక్రమాన్ని చేస్తున్నారు.

ప్రతీ అతిథి పేరుపై మొక్క

తమ వివాహానికి హాజరైన ప్రతీ అతిథి పేరుపై ఓ మొక్కను నాటాలని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. ఒక్కో అతిథి పేరుపై ఒక్కో మొక్కను నాటిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ సర్టిఫికేట్ లాంటిది తయారు చేయించి.. వారి పేరుపై మొక్కను నాటినట్టు తెలియజేస్తున్నారు.

రకుల్, జాకీ చేస్తున్న ఈ పనిని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అభినందించారు. తన పేరుపై మొక్క నాటినట్టు పంపిన సర్టిఫికేట్‍ను ఆమె తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. అందమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని, తమ పెళ్లికి హాజరైన ప్రతీ అథితి పేరుపై రకుల్, జాకీ మొక్క నాటుతున్నారని జైస్వాల్ వెల్లడించారు.

అలాగే, కొందరి పేర్లపై మొక్కలు నాటినట్టు రకుల్ కూడా కొన్ని ప్లాంట్ సర్టిఫికేట్లను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. ఆ మొక్కను ఏ తేదీన నాటారో కూడా అందులో ఉంది. క్యూఆర్ కోడ్‍ను కూడా పొందుపరిచారు.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ పెళ్లిని ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించుకున్నారు. వివాహ వేడుకలో టపాసులు కాల్చలేదు. పేపర్ వ్యర్థాన్ని తగ్గించేందుకు చాలా మందికి డిజిటల్ రూపంలోనే ఆహ్వాన పత్రికలు పంపారు. అలాగే, పెళ్లి వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణానికి మేలు చేసేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

పెళ్లికి వచ్చిన అతిథుల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసిన రకుల్ ప్రీత్ సింగ్‍పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనసులను గెలిచేశారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పర్యావరణం పట్ల బాధ్యత చూపిస్తున్నందుకు అభినందించారు.

రకుల్, జాకీ పెళ్లి ఇలా..

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం ఫిబ్రవరి 21వ తేదీన దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్‍లో అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయాల్లో రకుల్, జాకీ వివాహం జరిగింది. గోవాలో మూడు రోజుల పాటు వీరి పెళ్లి సందడి సాగింది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రకుల్ ప్రీత్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇందుకోసం హనీమూన్‍ను కూడా వాయిదా వేసుకున్నారట. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా ఉన్నారు. తదుపరి దేదే ప్యార్ దే 2 మూవీలో అజయ్ దేవ్‍గన్‍తో కలిసి నటించనున్నారు రకుల్.