Rakul Preet Singh Wedding: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్-rakul preet singh and jackky bhagnani are now married bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Singh Wedding: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh Wedding: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 21, 2024 06:31 PM IST

Rakul Preet Singh - Jackky Bhagnani Wedding: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. జాకీ భగ్నానీని ఆమె వివాహమాడారు. గోవాలో పెళ్లి గ్రాండ్‍గా జరిగింది.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం

Rakul Preet Singh - Jackky Bhagnani Marriage: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న వీరు ఇప్పుడు దంపతులు అయ్యారు. రకుల్ - జాకీ వివాహం నేడు (ఫిబ్రవరి 21) గోవాలో గ్రాండ్‍గా జరిగింది.

దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍తో పాటు మరికొందరు సినీ సెలెబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు. రకుల్, జాకీ కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు వచ్చారు.

రెండు సంప్రదాయాల్లో..

పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో రకుల్ - జాకీ వివాహం జరిగిందని తెలుస్తోంది. ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావాల్సి ఉంది. వీరి పెళ్లి ఫొటోల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ పెళ్లి వేడుకలు గోవాలోని ఐటీసీ గ్రాండ్‍లో ఫిబ్రవరి 19వ తేదీనే మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే పార్టీలు, ఫంక్షన్లు గ్రాండ్‍గా చేసుకున్నారు. మంగళవారం సంగీత్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో శిల్పా శెట్టి డ్యాన్స్ హైలైట్‍గా నిలిచిందని తెలుస్తోంది. ఇక నేడు రకుల్ - జాకీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఇద్దరూ ఆ తర్వాత ప్రేమికులయ్యారు. తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో వారిద్దరూ ప్రకటించారు. రకుల్ పుట్టిన రోజునే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత జంటగానే చాలా ఫంక్షన్‍లకు కూడా హాజరయ్యారు.

సినిమాలు ఇలా..

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వచ్చిన ఇండియన్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. ఇండియన్ 2 మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే కానుంది. బాలీవుడ్‍లోనూ మరో సినిమా రకుల్ చేతిలో ఉంది.

జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించిన బడే మియా చోటే మియా చిత్రం రిలీజ్‍ కావాల్సి ఉంది. ఈ చిత్రం ఏప్రిల్‍లో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, ట్రైగర్ ష్రాఫ్, పృథ్విరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలు పోషించారు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.