Rajamouli Documentary OTT Streaming Date: దర్శక ధీరుడు రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Rajamouli Documentary OTT Streaming Date: దర్శక ధీరుడు రాజమౌళిపై నిర్మించిన డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
Rajamouli Documentary OTT Streaming Date: ఎస్ఎస్ రాజమౌళి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా.. ఆ మాటకొస్తే పాన్ వరల్డ్ మెచ్చిన దర్శకుడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అతని రేంజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడలాంటి దర్శకుడిపై ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది.
రాజమౌళి డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై చెక్కిన సినిమాలు ఎలాంటి అద్భుతాలు సృష్టించాయో మనకు తెలుసు. మరి అదే రాజమౌళిపై రూపొందిన డాక్యుమెంటరీ ఎలా ఉంటుందో చూస్తారా? నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తోంది. మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి పేరుతో జక్కన్నపై ఈ ఓటీటీ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ డాక్యుమెంటరీలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్, జో రుసో, కరణ్ జోహార్ లాంటి వాళ్లు కూడా రాజమౌళిపై తమ అభిప్రాయాలు పంచుకోనుండటం విశేషం. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా దగ్గుబాటిలాంటి నటులు తమ అభిమాన దర్శకుడి గురించి ఆసక్తికరన విషయాలు కూడా ఇందులో చెప్పనున్నారు.
ఈ డాక్యుమెంటరీని అనుపమ చోప్రా సమర్పిస్తోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. "ఎస్ఎస్ రాజమౌళి ఓ విజనరీ. అతని ఊహ ఇండియన్ సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పింది. ప్రపంచవవ్యాప్తంగా ప్రేక్షకులను అతని ఆర్ట్ మెప్పించింది. స్టోరీ ఎలా చెప్పాలన్నదానిపై రాజమౌళి ఓ కొత్త ప్రమాణాలను క్రియేట్ చేశాడు. ప్రపంచ సినిమా చరిత్రపై అతడు వేసిన ముద్ర, అతని అత్యద్భుతమైన కెరీర్ ను తెరపైకి తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్, అప్లౌజ్ ఎంటర్టైన్మెంట్ లతో కలిసి పని చేయడం చాలా థ్రిల్లింగా ఉంది" అని చెప్పింది.
రాజమౌళి డాక్యుమెంటరీ ఇలా..
మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ఈ దర్శక ధీరుడు ఇండియన్ సినిమాతోపాటు ప్రపంచ సినిమాపై చూపిన ప్రభావాన్ని చూపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మోడర్న్ మాస్టర్స్ సిరీస్ లో భాగంగా రాజమౌళిపై డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఇండియాలోని క్రియేటివ్ విజనరీల ఘనతలను ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ ఇదే కాకుండా పలు ఇతర డాక్యుమెంటరీలను కూడా రూపొందించింది. అందులో ది గ్రేటెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్థాన్, యో యో హనీ సింగ్: ఫేమస్ అనే డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు రాజమౌళి డాక్యుమెంటరీ అతని గురించి తెలియని ఎలాంటి కొత్త కోణాలను ఆవిష్కరిస్తుందో చూడాలి.