James Cameron on SS Rajamouli: రాజమౌళిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించిన జేమ్స్ కామెరాన్.. ఏమన్నాడంటే?-james cameron on ss rajamouli rrr movie was spectacular says legendary hollywood director ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  James Cameron On Ss Rajamouli Rrr Movie Was Spectacular Says Legendary Hollywood Director

James Cameron on SS Rajamouli: రాజమౌళిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించిన జేమ్స్ కామెరాన్.. ఏమన్నాడంటే?

Hari Prasad S HT Telugu
Feb 07, 2024 01:49 PM IST

James Cameron on SS Rajamouli: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మరోసారి దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతమని కొనియాడాడు.

రాజమౌళిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించిన జేమ్స్ కామెరాన్
రాజమౌళిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించిన జేమ్స్ కామెరాన్

James Cameron on SS Rajamouli: మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియాలోనే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళిపై హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతమని, ఇండియన్ సినిమా ఇలా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందని అతడు అనడం గమనార్హం.

రాజమౌళిపై కామెరాన్ కామెంట్స్ వైరల్

గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వేదికపై వరుస అవార్డులతో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల సెర్మనీలో కామెరాన్ ని రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడటం విశేషం.

తాజాగా సాటర్న్ అవార్డుల కార్యక్రమంలో ఓ రిపోర్టర్ మరోసారి కామెరాన్ ను ఆ విషయం గురించి అడిగాడు. గతంలో రాజమౌళి అనే డైరెక్టర్ ను కలిశారు కదా.. అతని ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా ఉందన్నారు.. దాని గురించి కాస్త చెబుతారా అని సదరు రిపోర్టర్ ప్రశ్నించాడు. దీంతో మరోసారి కామెరాన్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాలపై స్పందించాడు.

"నిజం చెప్పాలంటే నేను అతనితో చాలా నిజాయతీగా నాకు అనిపించి విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై ఆదిరిస్తూ ఇలాంటి స్థాయికి చేరడం గొప్పగా ఉంది" అని కామెరాన్ అన్నాడు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది.

ఆర్ఆర్ఆర్ రియాక్షన్ ఇదీ

జేమ్స్ కామెరాన్ తమ సినిమాను ప్రశంసించడాన్ని ప్రస్తావిస్తూ.. "జేమ్స్ కామెరాన్.. మీ అమూల్యమైన మాటలు మాలో స్ఫూర్తి నింపుతాయి. మరింత బాగా పని చేసేలా పురిగొల్పుతాయి. ఇండియన్ సినిమా అన్ని సరిహద్దులను చెరిపేస్తుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం" అని ఆర్ఆర్ఆర్ మూవీ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడింది.

గతేడాది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్స్ తోపాటు ఆస్కార్ కూడా గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట దుమ్ము రేపింది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులకు కూడా నామినేట్ అయింది. ఈ సందర్భంగా అక్కడే కామెరాన్ ను రాజమౌళి కలిశాడు. ది గ్రేట్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ చూడటమే కాదు.. తన భార్య సుజీకి కూడా చూడాలని రికమంట్ చేసినట్లు రాజమౌళి చెప్పాడు.

ఆర్ఆర్ఆర్ తర్వాత మరో సినిమా చేయని రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లెవల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వచ్చే వేసవిలోనే మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియానా జోన్స్ రీతిలో ఈ మూవీ స్టోరీ ఉండబోతున్నట్లు ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి, మహేష్ సినిమా ఉండబోతోంది.

WhatsApp channel