Pushpa 2 Release Date: టెన్షన్‍కు తెర: పుష్ప 2 వాయిదా.. కొత్త రిలీజ్‍ డేట్‍ను అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్-pushpa 2 the rule postponed officially and new date announced by team and allu arjun pushpa 2 update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Release Date: టెన్షన్‍కు తెర: పుష్ప 2 వాయిదా.. కొత్త రిలీజ్‍ డేట్‍ను అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Pushpa 2 Release Date: టెన్షన్‍కు తెర: పుష్ప 2 వాయిదా.. కొత్త రిలీజ్‍ డేట్‍ను అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 17, 2024 08:45 PM IST

Pushpa 2 New Release Date: 'పుష్ప 2: ది రూల్' సినిమా వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. విడుదలను వాయిదా వేసింది మూవీ టీమ్. కొత్త రిలీజ్ డేట్‍ను కూడా వెల్లడించింది.

Pushpa 2 New Release Date: టెన్షన్‍కు తెర: పుష్ప 2 వాయిదా.. కొత్త రిలీజ్‍ డేట్‍ను అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
Pushpa 2 New Release Date: టెన్షన్‍కు తెర: పుష్ప 2 వాయిదా.. కొత్త రిలీజ్‍ డేట్‍ను అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Pushpa 2 New Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్.. గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ డ్రామా మూవీగా రూపొందిస్తున్నారు. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, వాయిదా పడుతుందనే రూమర్లు కొంతకాలంగా జోరుగా వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయితే, ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఆ రూమర్లే నిజమయ్యాయి. పుష్ప రాజ్ ఆగమనం ఆలస్యం కానుంది. పుష్ప 2 సినిమాను వాయిదా వేస్తున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటించింది. కొత్త రిలీజ్ డేట్‍ను కూడా వెల్లడించింది.

కొత్త రిలీజ్ డేట్ ఇదే

ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వడమే తమ లక్ష్యమని మూవీ టీమ్ వెల్లడించింది. పుష్ప 2 మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఖరారు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన ‘పుష్ప 2: ది రూల్’ సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ విషయంపై నేడు (జూన్ 17) అధికారిక ప్రకటన చేసింది. దీంతో సుమారు నాలుగు నెలలు ఆలస్యంగా రానుంది ఈ చిత్రం.

పుష్ప 2 వాయిదా గురించి ప్రేక్షకులకు వివరిస్తూ ఓ నోట్ కూడా పోస్ట్ చేసింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్. “మీకు బెస్ట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. బిగ్‍స్క్రీన్‍పై మరిచిపోలేని అనుభవం కోసం నిరీక్షణ మరింత కొనసాగుతుంది. 2024 డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2: ది రూల్ గ్రాండ్ రిలీజ్ కానుంది. అతడి (పుష్పరాజ్) రూల్ అద్భుతంగా ఉంటుంది” అని ట్వీట్ చేసింది. హీరో అల్లు అర్జున్ కూడా దీన్ని పోస్ట్ చేశారు.

కారణాలు ఇవే

పుష్ప 2 చిత్రాన్ని వాయిదా ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా మూవీ టీమ్ వెల్లడించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉన్నందునే వాయిదా తప్పలేదని పేర్కొంది. “అత్యంత ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాల్లో పుష్ప 2 ది రూల్ కూడా ఒకటి. అద్భుతంగా ఇచ్చే బాధ్యత మాపై చాలా పెరిగింది. చెప్పిన సమయానికి రిలీజ్ చేయాలని మేం విశ్రాంతి లేకుండా శ్రమించాం. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉండడం వల్ల ఆగస్టు 15వ తేదీన విడుదల చేయలేకున్నాం. నాణ్యతలో రాజీ లేకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే మా ధ్యేయం” అని మూవీ టీమ్ తన నోట్‍లో వెల్లడించింది. డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 రిలీజ్ చేస్తామని, బెస్ట్ ఇచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి.

WhatsApp channel