Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు-priyadarshi to do lead role in three upcoming movies know the details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు

Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 28, 2024 09:09 PM IST

Priyadarshi: ప్రియదర్శికి హీరోగా అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హీరోగా మూడు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. దీంతో కెరీర్‌లో పుల్ జోష్‍లో ఉన్నారు. ఆ వివరాలివే..

Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు
Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు

Priyadarshi: కమెడియన్‍గా ప్రియదర్శి చాలా ఫేమస్ అయ్యారు. కామెడీ టైమింగ్‍తో అందరినీ ఆకట్టుంటున్నారు. పెళ్లి చూపులు చిత్రం నుంచి తాజాగా వచ్చిన ఓం భీమ్ బుష్ వరకు చాలా సినిమాల్లో కమెడియన్‍‍గా, సపోర్టింగ్ పాత్రల్లో ప్రియదర్శి మెప్పించారు. ఈ క్రమంలో 2019లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో మల్లేశం చిత్రం వచ్చింది. తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో.. కామెడీనే కాకుండా తాను ఎమోషనల్ క్యారెక్టర్లు కూడా చేయగలనని ఆ చిత్రంతో ప్రియదర్శి నిరూపించారు. 2023లో ప్రియదర్శి హీరోగా బలగం వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. జాతిరత్నాలులోనూ మెయిన్ రోల్ చేశారు. మరోవైపు కమెడియన్‍గా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రియదర్శి. అయితే, ఆయనకు హీరోగా అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రియదర్శి హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు లైనప్‍లో ఉన్నాయి.

ప్రియదర్శి హీరోగా డార్లింగ్ చిత్రం రూపొందుతోంది. అలాగే, హీరో దగ్గుబాటి రానా బ్యానర్ స్పిరిట్ మీడియా, ఎస్‍వీసీఎల్‍ఎల్‍పీ బ్యానర్ల కింద మరో చిత్రం హీరోగా చేయనున్నారు ప్రియదర్శి. ఈ మూవీపై నేడు (ఏప్రిల్ 28) అనౌన్స్‌మెంట్ వచ్చింది. అలాగే, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతోనూ మరో మూవీ చేస్తున్నారు ప్రియదర్శి. ఇలా.. హీరోగా ప్రియదర్శి లైనప్‍లో మూడు చిత్రాలు ఉన్నాయి.

డార్లింగ్

ప్రియదర్శి హీరోగా ప్రస్తుతం డార్లింగ్ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో నబా నటేశ్ హీరోయిన్‍గా చేస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇటీవలే వచ్చింది. భార్యపై ఫ్రస్ట్రేషన్ చూపే భర్తగా ఈ చిత్రంలో ప్రియదర్శి రోల్ ఉండనుందని అర్థమవుతోంది. డార్లింగ్ సినిమాలో ప్రియదర్శి, నబా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్ కీరోల్స్ చేస్తున్నారు. డార్లింగ్ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హనుమాన్ నిర్మాత కే నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంద్రగంటితో..

సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో ప్రియదర్శి హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో రూప కొడవాయూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. శ్రీదేవీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రంలో వీకే నరేశ్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్ కూడా కీరోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.

రానా నిర్మాణంలో..

ప్రియదర్శి హీరోగా మరో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. హీరో దగ్గుబాటి రానాకు చెందిన స్పిరిట్ మీడియా బ్యానర్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‍పీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ ఈ మూవీతో నిర్మాతగా డెబ్యూట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రకటన నేడు (ఏప్రిల్ 28) వచ్చింది. థ్రిల్-లు-ప్రాప్తిరస్తు అంటూ పోస్టర్ రివీల్ చేసింది మూవీ టీమ్.

ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చే ఛాన్స్ ఉంది. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలా.. హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు ప్రియదర్శి చేతిలో ఉన్నాయి. అలాగే, మరిన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌ కూడా చేస్తున్నారు.

IPL_Entry_Point