Priyadarshi: రెండు క్యారెక్టర్లు బాధపడుతుంటే నవ్వొస్తుంది.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్-priyadarshi comments on dark comedy in darling movie priyadarshi upcoming movies save the tigers 3 ott update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyadarshi: రెండు క్యారెక్టర్లు బాధపడుతుంటే నవ్వొస్తుంది.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi: రెండు క్యారెక్టర్లు బాధపడుతుంటే నవ్వొస్తుంది.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jul 19, 2024 04:26 PM IST

Priyadarshi About Comedy Movies: ప్రియదర్శి, బ్యూటిఫుల్ నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ డార్లింగ్. జూలై 19న అంటే ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు హీరో ప్రియదర్శి.

రెండు క్యారెక్టర్లు బాధపడుతుంటే నవ్వొస్తుంది.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్
రెండు క్యారెక్టర్లు బాధపడుతుంటే నవ్వొస్తుంది.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi About Darling Movie: కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కీలక పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రియదర్శి. అలాగే హీరోగా కూడా చేస్తూ సూపర్ క్రేజ్‌తో సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు ప్రియదర్శి. మల్లేశం, బలగం, మంగళవారం సినిమాలతో అలరించిన ప్రియదర్శి సేవ్ ది టైగర్స్ కామెడీ వెబ్ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.

తాజాగా హీరోగా మరో సినిమాతో అలరించాడు ప్రియదర్శి. హీరోగా ప్రియదర్శి హీరోయిన్‌గా నభా నటేష్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ డార్లింగ్. ప్రభాస్ టైటిల్‌తో వచ్చిన డార్లింగ్ సినిమా ఇవాళ అంటే జూలై 19న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు కామెడీ సినిమాలు, డార్క్ కామెడీకి సంబంధించి ఆసక్తికర విశేషాలు చెప్పాడు ప్రియదర్శి.

డార్లింగ్ టైటిల్ పెట్టడం ప్రెజర్ అనిపించిందా ?

-ప్రెజర్ ఉంది. అయితే స్క్రిప్ట్ మీద కూడా నమ్మకం ఉంది. ఈ సినిమాకి ఇది పర్ఫెక్ట్ టైటిల్. డార్లింగ్ అనే టైటిల్ చాలా ప్రేమతో పెట్టాం.

నాని గారిలానే మీరు కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారు. ఆయన ప్రభావం ఏమైనా ఉందా?

-దసరా లాంటి మాస్ మసాలా సినిమా చేసిన తర్వాత హాయ్ నాన్న లాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. నాని అన్ని ప్రేక్షకులకు డిఫరెంట్ జోనర్స్‌లో డిఫరెంట్ కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా ఇన్సిప్రెషనల్‌గా అనిపిస్తుంటుంది. హాయ్ నాన్న సినిమా షూటింగ్ సమయంలోనే జగదీశ్ రాసిన కథ సరదాగా చెప్పాను. కథ విన్న వెంటనే సినిమా చేస్తున్నాం, షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ?

-మేము ఫ్రెండ్స్‌గా కలిసి పెరిగాం. వివేక్ సాగర్‌కి ఇది 25వ సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తన గ్రోత్ చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది.

డార్లింగ్‌లో డ్యాన్సులు కూడా చేసినట్లున్నారు?

-నాకూ తెలీదు నేను చేస్తానని (నవ్వుతూ). ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీకి దక్కుతుంది.

కొత్త సినిమాల గురించి?

-ఆగస్ట్ 15న 35 చిన్న కథ కాదు వస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్‌లో రోషన్‌తో ఓ సినిమా ఉంది. సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి.

డార్లింగ్ ఆన్ పేపర్ సీరియస్ కథలా అనిపిస్తోంది. దాన్ని హ్యుమర్ అండ్ ఎంటర్‌టైనింగ్ చెప్పడం ఛాలెజింగ్‌గా అనిపించిందా?

-జనరల్‌గా మ్యారేజ్‌ని చాలా స్టీరియోటిపికెల్ అప్రోచ్‌లో చూస్తాం. డార్లింగ్ విషయానికి వస్తే.. విమన్ క్యారెక్టర్ స్ల్పిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్‌లు సీరియస్‌గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో ఉన్న మ్యాజిక్ ఇది. డార్లింగ్‌లో అది చాలా అద్భుతంగా ఎక్స్‌ఫ్లోర్ చేశాం.

Whats_app_banner