Premalu Telugu Trailer: మలయాళ బ్లాక్‍ బస్టర్ ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. లవ్ స్టోరీ, కామెడీతో ఇంట్రెస్టింగ్‍గా..-premalu telugu trailer review nelsen k gafoor mamitha baiju movie set to release on march 8 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Premalu Telugu Trailer Review Nelsen K Gafoor Mamitha Baiju Movie Set To Release On March 8

Premalu Telugu Trailer: మలయాళ బ్లాక్‍ బస్టర్ ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. లవ్ స్టోరీ, కామెడీతో ఇంట్రెస్టింగ్‍గా..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 02, 2024 08:15 PM IST

Premalu Telugu Trailer: ప్రేమలు సినిమా తెలుగు ట్రైలర్ వచ్చేసింది. లవ్ స్టోరీ, కామెడీ, ట్రెండీ డైలాగ్‍లతో ఇంట్రెస్టింగ్‍గా ఉంది. రిలీజ్ డేట్ కూడా వెల్లడించింది టీమ్.

Premalu Telugu Trailer: మలయాళ బ్లాక్‍బాస్టర్ ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Premalu Telugu Trailer: మలయాళ బ్లాక్‍బాస్టర్ ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ రిలీజ్

Premalu Telugu Trailer: మలయాళంలో ప్రేమలు మూవీ బంపర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కి సెన్సేషనల్ హిట్ అయింది. క్యూట్ లవ్ స్టోరీ, కామెడీతో వచ్చిన ఈ రోమ్-కామ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.80కోట్లకు భారీ వసూళ్లు సాధించి.. ఇంకా దూసుకెళుతోంది. ఇప్పుడు ప్రేమలు సినిమా తెలుగులోకి కూడా వచ్చేస్తోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ నేడు (మార్చి 2) రిలీజ్ అయింది.

ప్రేమలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ. తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ట్రైలర్లో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ చిత్రంలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రేమలు చిత్రానికి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు.

ప్రేమలు తెలుగు ట్రైలర్ ఇలా..

వేరే ఊరి నుంచి హైదరాబాద్ వచ్చే సచిన్ సంతోష్ (నెల్సన్ కే గఫూర్).. హైదరాబాద్‍లో జరిగిన ఓ పెళ్లిలో రేణు (మమితా బైజూ)ను చూసి ఇష్టపడతాడు. ఈ విషయాన్ని రైలులో రేణుకు చెప్పేందుకు సచిన్ ప్రయత్నిస్తాడు. అయితే, రేణు నిద్రలో ఆ మాట వినదు. ఈ సీన్‍తో ట్రైలర్ మొదలైంది. రేణును ప్రేమలో పడేసేందుకు హైదరాబాద్‍లోనే గేట్ కోచింగ్ తీసుకునేందుకు సచిన్ డిసైడ్ అవుతాడు.

సచిన్, రేణు ఫ్రెండ్స్ అవుతారు. అయితే, వాళ్ల ఐటీ కంపెనీలోనే పని చేసే ఆది అనే వ్యక్తి రేణును ఇష్టపడతాడు. మరోవైపు రేణును ప్రేమలో పడేసేందుకు సచిన్ తంటాలు పడతాడు. మరి సచిన్ ప్రేమ సక్సెస్ అయిందా అనేది మూవీలో ఉండనుంది. “అమీర్ పేటలో అన్ని కోచింగ్‍లు ఇస్తారుగా.. అమ్మాయిలను ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుండు” అని సచిన్ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది.

ప్రేమలు తెలుగు ట్రైలర్లో డైలాగ్స్ హైలైట్‍గా నిలిచాయి. ఎక్కడా డబ్బింగ్‍లా అనిపించలేదు. ఆదిత్య హాసన్ తన మార్క్ చూపించాడు. “ఫ్రెండ్స్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిది రా.. పబ్లిసిటీ, పైసలు ఉంటాయి.. కానీ ప్రశాంతత ఉండదు” అనే డైలాగ్ హైలైట్‍గా ఉంది. డైలాగ్స్ ఎక్కువ శాతం సరదాగానే ఉన్నాయి.

రిలీజ్ అప్పుడే..

ప్రేమలు తెలుగు వెర్షన్ మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌తోనే విడుదల తేదీని కూడా మూవీ టీమ్ వెల్లడించింది. మలయాళంలో సూపర్ హిట్ అవడం, హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో మూవీ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండడంతో మంచి బజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.

ప్రేమలు మూవీలో నెల్సెన్, మమితాతో పాటు శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షామీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో హైలైట్‍గా ఉంది. సినిమాకు తగ్గట్టుగా ఆకర్షణీయంగా ఉంది.

IPL_Entry_Point