OTT: ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్న మూడు సూపర్ హిట్ డిఫరెంట్ జానర్ల సినిమాలు: వివరాలివే..-premalu om bheem bush and gaami set to stream on same day on aha amazon prime video and zee5 ott platforms respectively ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్న మూడు సూపర్ హిట్ డిఫరెంట్ జానర్ల సినిమాలు: వివరాలివే..

OTT: ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్న మూడు సూపర్ హిట్ డిఫరెంట్ జానర్ల సినిమాలు: వివరాలివే..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 08, 2024 08:24 PM IST

OTT Movies: ఈవారం ఒకే రోజు మూడు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలో అడుగుపెట్టనున్నాయి. డిఫరెంట్ జానర్లలో వచ్చిన ఈ సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఆ వివరాలు ఇవే.

OTT: ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్న మూడు సూపర్ హిట్ డిఫరెంట్ జానర్ల సినిమాలు: వివరాలివే..
OTT: ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్న మూడు సూపర్ హిట్ డిఫరెంట్ జానర్ల సినిమాలు: వివరాలివే..

OTT: ఈవారం ఓటీటీల్లో సూపర్ హిట్ చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఒకే రోజు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. కామెడీ హారర్ మూవీ ‘ఓం భీమ్ బుష్’, లవ్ కామెడీ సినిమా ‘ప్రేమలు’, అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘గామి’ ఒకే రోజు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. ఒకదానితో పోలిస్తే మరొకటి డిఫరెంట్ జానర్లలో ఉన్న ఈ చిత్రాలు ఒకే వారంలో స్ట్రీమింగ్‍కు రావడం ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‍న్యూస్‍గా ఉంది. ఈ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఓం భీమ్ బుష్ సినిమా మంచి హిట్ అయింది. శ్రీహర్ష కొనగంటి దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చి 22న రిలీజైన ఈ చిత్రం కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓం భీమ్ బుష్ సినిమా ఏప్రిల్ 12వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఓం భీమ్ బుష్ చిత్రంలో విష్ణు, ప్రియదర్శి, రాహుల్ కామెడీ టైమింగ్, హారర్, ట్విస్ట్ అదిరిపోయాయి. ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు. ఈ మూవీని ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు.

గామి

అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన గామి చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ఈ చిత్రంలో అఘోరగా నటించగా.. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. చాందినీ చౌదరి, అభినయ, హారికా పెద్ది, మహమ్మద్ సమాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు. మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు, గామి సినిమా ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ జీ5లో స్ట్రీమింగ్‍కు రానుంది.

ప్రేమలు

మలయాళ మూవీ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.135కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి దుమ్మురేపింది. నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించిన ఈ లవ్ రొమాంటిక్ కామెడీ ప్రేమలు చిత్రానికి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన థియేటర్లలో ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇక, ప్రేమలు సినిమా మలయాళం, హిందీ, తమిళ వెర్షన్‍లు కూడా ఏప్రిల్ 12వ తేదీనే డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి.

కాగా, రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలామ్ చిత్రం కూడా ఏప్రిల్ 12వ తేదీన సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

IPL_Entry_Point