Om Bheem Bush Day 2 Collections: తొలి రోజు కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు.. దూసుకెళుతోన్న ‘ఓం భీమ్ బుష్’-om bheem bush day 2 collections sree vishnu movie shows good growth at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Om Bheem Bush Day 2 Collections: తొలి రోజు కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు.. దూసుకెళుతోన్న ‘ఓం భీమ్ బుష్’

Om Bheem Bush Day 2 Collections: తొలి రోజు కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు.. దూసుకెళుతోన్న ‘ఓం భీమ్ బుష్’

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 24, 2024 02:13 PM IST

Om Bheem Bush Day 2 Collections: ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది. తొలి రోజు కంటే రెండో రోజు అధిక వసూళ్లతో దుమ్మురేపింది. మంచి హిట్ దిశగా దూసుకెళుతోంది.

Om Bheem Bush Day 2 Collections: తొలి రోజు కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు.. దూసుకెళుతోన్న ‘ఓం భీమ్ బుష్’
Om Bheem Bush Day 2 Collections: తొలి రోజు కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు.. దూసుకెళుతోన్న ‘ఓం భీమ్ బుష్’

Om Bheem Bush Day 2 Collections: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‍లో వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమా అంచనాలను అందుకుంటూ దూసుకెళుతోంది. ఈ మూవీకి తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వృద్ధి సాధించింది. మార్చి 22వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ హారర్ మూవీకి ఆరంభం నుంచి సానుకూల స్పందన వస్తోంది. దీంతో మంచి హిట్ దిశగా సాగుతోంది. ఈ చిత్రానికి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంత వచ్చాయంటే..

ఓం భీమ్ బుష్ చిత్రం రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. క్రేజ్‍ను నిలుపుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మూవీ వసూళ్లలోనూ దుమ్మురేపుతోంది. రెండు రోజుల కలెక్షన్ల వివరాలను యూవీ క్రియేషన్స్ వెల్లడించింది.

బ్లాక్‍బస్టర్ లాఫ్స్ ఆల్ఓవర్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఆ ప్రొడక్షన్. రెండో రోజుల్లో రూ.10.44 కోట్లు వచ్చాయంటూ పేర్కొంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ 2.50లక్షల డాలర్ల మార్కును దాటింది.

తొలి రోజు కంటే అధికం

ఓం భీమ్ బుష్ చిత్రానికి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.4.6కోట్ల వసూళ్లు దక్కాయి. అయితే, పాజిటివ్ టాక్ రావడం, పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో ఈ మూవీకి కలెక్షన్లు పెరగొచ్చనే అంచనాలు వచ్చాయి. బుకింగ్స్ ట్రెండ్స్ కూడా అలాగే కనిపించాయి. అందుకు తగ్గట్టుగానే రెండో రోజు ఈ మూవీ వసూళ్లు పెరిగాయి. ఈ చిత్రానికి శనివారమైన సెకండ్ డే సుమారు రూ.5.8 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మూడో రోజు కూడా జోరు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఓం భీమ్ బుష్ చిత్రాన్ని దర్శకుడు కొనుగంటి తెరకెక్కించారు. టైటిల్ నుంచే బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌తో హైప్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన వెరైటీ ప్రమోషన్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రానికి ప్రచారం బాగానే వచ్చింది. ఇక అందుకు తగ్గట్టే కంటెంట్ కూడా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది.

ఓం భీమ్ బుష్ మూవీలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సంపంగి మహల్‍లో నిధి కోసం శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి వెళ్లడం ఈ మూవీలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఎమోషనల్ పాయింట్ ఉన్నా పూర్తిస్థాయిలో ఎంటర్‌టైనింగ్ మూవీగానే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీరోల్స్ చేశారు.

సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా..

మూవీ హిట్ అవడంతో ఓం భీమ్ బుష్ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‍రాజు, డైరెక్టర్ మారుతీ కూడా హాజరయ్యారు. కొన్ని థియేటర్లకు వెళుతూ కూడా ప్రమోషన్లను చేస్తోంది మూవీ టీమ్. ఐపీఎల్ కామెంటరీ బాక్సులోనూ శనివారం కాసేపు కనిపించారు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ. ఇలా ఈ చిత్రంలో కోసం ఇంకా జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వీ సెల్యులాయిడ్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ సంగీతం అందించారు.

IPL_Entry_Point