Prabhas Raja Saab: మా నష్టాలన్నింటినీ రాజా సాబ్ ఒక్కడే పూడుస్తాడు: నిర్మాత కామెంట్స్ వైరల్-prabhas raja saab will recover all our losses says producer tg vishwa prasad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Raja Saab: మా నష్టాలన్నింటినీ రాజా సాబ్ ఒక్కడే పూడుస్తాడు: నిర్మాత కామెంట్స్ వైరల్

Prabhas Raja Saab: మా నష్టాలన్నింటినీ రాజా సాబ్ ఒక్కడే పూడుస్తాడు: నిర్మాత కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Aug 29, 2024 08:53 PM IST

Prabhas Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ మూవీ గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరోసారి విపరీతమైన హైప్ ఇచ్చాడు. తాము ఇన్నాళ్లూ ఎదుర్కొన్న నష్టాలన్నింటినీ ఈ ఒక్క సినిమాతోనే పూడ్చుకుంటామని అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మా నష్టాలన్నింటినీ రాజా సాబ్ ఒక్కడే పూడుస్తాడు: నిర్మాత కామెంట్స్ వైరల్
మా నష్టాలన్నింటినీ రాజా సాబ్ ఒక్కడే పూడుస్తాడు: నిర్మాత కామెంట్స్ వైరల్

Prabhas Raja Saab: ప్రభాస్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ కు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఎక్కడికెళ్లినా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా స్వాగ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన అతడు.. తమ నష్టాలను పూడ్చే సినిమా రాజా సాబే అని అనడం విశేషం.

రాజా సాబ్ నష్టాలను పూడుస్తాడు

టాలీవుడ్ లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ వరుస సినిమాలు తీసే నిర్మాత టీజీ విశ్వప్రసాద్. అతని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లోనే ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో అదే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తెలుగు హక్కులను తీసుకొని తీవ్రంగా నష్టపోయాడతడు.

ఇదే కాకుండా పలు ఇతర సినిమాలతోనూ ఈ ప్రొడ్యూసర్ బాగానే నష్టాలు ఎదుర్కొన్నాడు. స్వాగ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి ఇదే ప్రశ్న అతన్ని అడిగాడు. దీనికి విశ్వ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు.

"ఈ మధ్య వచ్చింది ఊహించనిదే. అంతకుముందు మనమే బాలేదన్నారు. దానికి ముందు మరో సినిమా కూడా ఫ్లాపయింది. ఇంతకుముందు చెప్పినట్లు ఇది ల్యాండ్ మార్క్ మూవీ కాబోతోంది. రాజా సాబ్ ఏప్రిల్లో వస్తోంది. మాకు ఇప్పటి వరకూ వచ్చిన నష్టాలను అది కవర్ చేస్తది" అని అతడు అనడం విశేషం. ఇక స్వాగ్ మూవీ విషయానికి వస్తే ఇందులో శ్రీ విష్ణు లీడ్ రోల్లో నటించాడు. హసిత్ గోలి డైరెక్ట్ చేశాడు.

ప్రభాస్ రెమ్యునరేషన్

నిజానికి రాజా సాబ్ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఒక్కో సినిమాకు అతడు సుమారు రూ.150 కోట్లు వసూలు చేస్తున్నాడు. కానీ ది రాజా సాబ్ మూవీ కోసం రూ.100 కోట్లే తీసుకుంటున్నట్లు ఓటీటీప్లే తన కథనంలో వెల్లడించింది.

ది రాజాసాబ్ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకోవడానికి ఓ బలమైన కారణమే ఉందని కూడా అదే కథనంలో వెల్లడైంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రభాస్ గతంలో నటించిన ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నది ఇతడే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.

దీంతో విశ్వప్రసాద్ భారీగానే నష్టపోయాడు. ఆ నష్టాలను పూడ్చడానికే ప్రభాస్ ఇప్పుడిలా ఈ రాజా సాబ్ మూవీ కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ది రాజా సాబ్ మూవీకి లాభాలు వచ్చి, ప్రొడ్యూసర్ తాను ఆదిపురుష్ వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందిన తర్వాతే తాను వాటా తీసుకుంటానని కూడా ప్రభాస్ హామీ ఇచ్చినట్లు ఆ రిపోర్టు తెలిపింది.