CM Revanth Reddy : ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు-hyderabad cm revanth reddy participated in kshatriya meeting praised hero prabhas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

CM Revanth Reddy : ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 18, 2024 10:13 PM IST

CM Revanth Reddy : హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయిస్తామని, అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద క్షత్రియులకు సంక్షేమం అందజేస్తామన్నారు. ప్రభాస్‌ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కితాబిచ్చారు.

ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

CM Revanth Reddy : హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని సీఎం తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్ఫూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన విధానాలను, చేపట్టిన కార్యక్రమాలను సీఎం తన సందేశంలో ప్రస్తావించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో చేపట్టామని, ఇటీవలి తన విదేశీ పర్యటనల్లోనూ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ఫోర్త్ సిటీపై ఆసక్తి చూపించాయని సీఎం తెలిపారు.

హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయింపు

వ్యక్తిగత శ్రమ, విధేయత ఒక మనిషిని ఉన్నత స్థానానికి చేరుస్తాయని, నేపథ్యాలు వేరైనప్పటికీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, కర్ణాటక మంత్రి బోసురాజు అలా కష్టపడి పైకి వచ్చినవారే అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయింపు, అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని, పేద క్షత్రియులకు కూడా సంక్షేమం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు, క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభాస్ లేకుండా బాహుబలిని ఊహించలేం

విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఎందులోనైనా విజయవంతం అవుతారన్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్‌ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కితాబిచ్చారు. హాలీవుడ్‌ రేంజ్‌ లో ఉన్న సినిమా బాహుబలిని ప్రభాస్‌ లేకుండా ఊహించలేమన్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారన్నారు. దివంగత సినీనటుడు కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ తనకు మంచి మిత్రుడు అన్నారు. నా కన్నా గొప్ప వాళ్లు స్టేజి ముందు వినయంగా కూర్చొన్నారని, అదీ క్షత్రియుల గొప్పతనం అన్నారు. కొంపల్లిని పెద్ద నగరంగా చేసింది క్షత్రియులే అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం