IRCTC Karnataka Package : కూర్గ్ సహా కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC Karnataka Package : కర్ణాటకలోని ఫేమస్ టెంపుల్స్ తో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 6 రోజుల పాటు కర్ణాటకలోని మైసూర్, మెల్కోటే, సోమనాథపుర, కూర్గ్, బేలూర్, హళేబీడులోని ఆలయాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 27న ప్రారంభం అవుతుంది.
IRCTC Karnataka Package : కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో 6 రోజుల పాటు పర్యటించేందుకు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. కాఫీ విత్ కర్ణాటక పేరుతో 5 రాత్రులు/6 రోజుల పాటు బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్ లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 27న ప్రారంభం అవుతుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 27750.
విమాన వివరాలు : -
తేదీ | ఫ్లైట్ నెం | ప్రారంభం | సమయం | గమ్యస్థానం | సమయం |
27.09.2024 | 6E 413 | హైదరాబాద్ | 06:45 గం | బెంగళూరు | 07:50 గం |
02.10.2024 | 6E 684 | బెంగళూరు | 22:30 గం | హైదరాబాద్ | 23:40 గం |
ఒక్కో వ్యక్తికి ఖర్చు
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ విత్ బెడ్(2-4 సంవత్సరాలు) |
కంఫర్ట్ | రూ.38000/- | రూ.29600/- | రూ.27750/- | రూ.23950/- | రూ.19550/- | రూ.16400/- |
టూర్ సర్క్యూట్లు: మైసూర్ - మేల్కోట్ - సోమనాథపుర - కూర్గ్ - బేలూర్ - హళేబీడు
ప్రయాణం ఇలా
1వ రోజు : హైదరాబాద్ - బెంగళూరు - మైసూర్
ఉదయం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో బయలుదేరుతారు. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో పికప్ చేసి మైసూర్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి మైసూర్ చేరుకుని హోటల్‌లో దిగుతారు. ఫ్రెష్ అయ్యాక మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ సందర్శించవచ్చు. రాత్రికి మైసూర్‌లో బస చేస్తారు.
2వ రోజు : మైసూర్
ఉదయం హోటల్‌లో అల్పాహారం తర్వాత శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు (15 కిమీ). ఆ తర్వాత మెల్కోటే (35 కి.మీ.)కి బయలుదేరతారు. అక్కడ చెలువనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సోమనాథపుర, తలకాడు ఆలయాలకు (80 కి.మీ.) బయలుదేరతారు. దర్శనం అనంతరం సాయంత్రానికి తిరిగి మైసూర్ చేరుకుంటారు. రాత్రికి మైసూర్ లో బస చేస్తారు.
3వ రోజు : మైసూర్ - కూర్గ్
బ్రేక్ ఫాస్ట్ తర్వాత కూర్గ్‌కి బయలుదేరతారు (120 కి.మీ.). ఈ మార్గంలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా చూడవచ్చు. కూర్గ్ చేరుకుని హోటల్‌లో దిగుతారు. మధ్యాహ్నం రాజా సీట్ ను సందర్శిస్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.
4వ రోజు: కూర్గ్
హోటల్‌లో అల్పాహారం తర్వాత తాలా కావేరికి (45 కి.మీ.) వెళ్తారు. కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కూర్గ్ కు తిరిగి వెళ్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.
5వ రోజు: కూర్గ్ - హాసన్
హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి సకలేష్‌పూర్‌కి (100 కి.మీ.) బయలుదేరతారు. మంజీరాబాద్ కోటను సందర్శి్స్తారు. మధ్యాహ్నం హాసన్‌కు (45 కి.మీ.) బయలుదేరతారు. అక్కడ హోటల్‌లో దిగి, హాసన్‌లోనే రాత్రి బస చేస్తారు.
6వ రోజు: హాసన్ - బెంగళూరు - హైదరాబాద్
హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి బేలూర్ (40 కి.మీ.)కి బయలుదేరతారు. అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హళేబీడు (16 కి.మీ.లు)కి వెళ్లి హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బెంగళూరుకు (240 కి.మీ.) వస్తారు. సాయంత్రానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
హైదరాబాద్ నుంచి కర్ణాటక ఐఆర్సీటీసీ టూర్ బుకింగ్, ఇతర వివరాలను ఈ కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం