తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Araku Tour Package : అరకు అందాలు చూసొద్దామా? ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీ ఇదే
- IRCTC Araku Tour Package : ఐఆర్సీటీసీ వన్ డే అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ, అరకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.
- IRCTC Araku Tour Package : ఐఆర్సీటీసీ వన్ డే అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ, అరకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.
(1 / 7)
సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం, ప్రకృతి మనసుకు ప్రశాంత భావాన్ని కలిగిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు, గుహాలు, కొండల మధ్యలో రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? అయితే విశాఖపట్నం, అరకు లోయను సందర్శించాల్సిందే.
(2 / 7)
విశాఖ, అరకులోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. ఐఆర్సీటీసీ విశాఖ నుంచి అరకు ఒక రోజు టూర్ ప్యాకేజీ అందిస్తుంది.
(3 / 7)
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ :-క్లాస్ : ప్యాకేజీ టారిఫ్‌లు (రూ.) EV క్లాస్ : 3010(పెద్దలు)- 2615(పిల్లలు)SL క్లాస్ : 2125(పెద్దలు)-1730(పిల్లలు)2S తరగతి : 2055(పెద్దలు)-1655(పిల్లలు)
(4 / 7)
అరకు లోయ, జలపాతాలు, ప్రవాహాలు, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. దీనిని "ఆంధ్రా ఊటీ" అని పిలవవచ్చు. ఐఆర్సీటీసీ టూర్ లో అరకు వ్యాలీ(ట్రైబల్ మ్యూజియం, టీ గార్డెన్స్ & ధిమ్సా డ్యాన్స్), అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు వీక్షించవచ్చు.
(5 / 7)
విశాఖపట్నం నుంచి అరకు : విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రైలులో(నెం. 08551) అరకు లోయకు వెళ్తారు. ఈ రైలు ఉదయం 06.45 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. సొరంగాలు, వంతెనలు దాటుతూ... ప్రకృతి అందాలను వీక్షిస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. ఉదయం 10.55కు రైలు అరకు చేరుకుంటుంది.
(6 / 7)
అరకు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, కాఫీ గార్డెన్స్ సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం చేసి రోడ్డు మార్గంలో తిరిగి వైజాగ్‌కు చేరుకుంటారు. ఈ మార్గంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ వీక్షిస్తారు. సాయంత్రానికి తిరిగి వైజాగ్ చేరుకుంటారు.
ఇతర గ్యాలరీలు