Coastal Karnataka Tour : 'కర్ణాటక' ట్రిప్... బడ్జెట్ ధరలోనే మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, పూర్తి వివరాలివే
- Hyderabad Karnataka Tour Package: కర్ణాటకలో(Coastal)ని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC 'టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వెళ్లే తేదీలు, ధరలతో పాటు షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి……
- Hyderabad Karnataka Tour Package: కర్ణాటకలో(Coastal)ని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC 'టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వెళ్లే తేదీలు, ధరలతో పాటు షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి……
(1 / 6)
కోస్టల్ కర్ణాటకలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలని అనుకునే వారికి ఐఆర్ సీటీసీ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.(image source from unsplash.com)
(2 / 6)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. (image source from unsplash.com)
(3 / 6)
'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. తొలి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.(image source from unsplash.com)
(4 / 6)
రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.(image source from unsplash.com)
(5 / 6)
నాల్గో రోజు Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.(image source from unsplash.com)
(6 / 6)
'COASTAL KARNATAKA' టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్ ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ధరలు తగ్గాయి. గతంలో కంఫార్ట్ క్లాస్ లోనే సింగిల్ అక్యుపెన్సీకి 40 వేలకు పైగా ధర ఉండేది. ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 (image source from unsplash.com)
ఇతర గ్యాలరీలు