IRCTC Andaman Tour : అందమైన 'అండమాన్' దీవులను చూడాలనుకుంటున్నారా..! హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, వివరాలివే
- Hyderabad Andaman Tour Package: అందమైన అండమాన్ దీవుల్లో విహరించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందమైన బీచ్‌లతో పాటు ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులను తక్కువ ధరలోనే చూపించనుంది. అక్టోబరులో ట్రిప్ ఉండనుంది. మిగతా వివరాలను పూర్తి కథనంలో చూడండి…
- Hyderabad Andaman Tour Package: అందమైన అండమాన్ దీవుల్లో విహరించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందమైన బీచ్‌లతో పాటు ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులను తక్కువ ధరలోనే చూపించనుంది. అక్టోబరులో ట్రిప్ ఉండనుంది. మిగతా వివరాలను పూర్తి కథనంలో చూడండి…
(1 / 6)
(2 / 6)
తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు చూడాలనుకుంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లాల్సిందే. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ… "AMAZING ANDAMAN EX HYDERABAD' పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
(image source from unsplash.com)(3 / 6)
(4 / 6)
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 06:35 AM ఫ్లైట్ బయల్దేరుతుంది.09.15 గంటలకు పోర్ట్ బ్లెయిర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. సెల్యూలర్ జైల్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత Corbyns Cove Beachకు వెళ్తారు. ఆ తర్వాత సెల్యూలర్ జైలు వద్ద లైడ్ అండ్ సౌండ్ షోను వీక్షిస్తారు.
(image source from unsplash.com)(5 / 6)
బ్రేక్ ఫాస్ట్ తర్వాత… రోస్ ఐల్యాండ్ కు వెళ్తారు. ఆ తర్వాత నార్త్ బే ఐల్యాండ్ ను సందర్శిస్తారు. ఇక్కడ పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత తిరిగి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్తారు. ఇక్కడ్నుంచి Samudrika Marine Museumకు వెళ్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే బస చేస్తారు. మూడో రోజు Havelockకు వెళ్తారు. ఇక్కడ ఉన్న Radhanagar beachను సందర్శిస్తారు. రాత్రి Havelockలోనే బస చేస్తారు. నాల్గో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. Kala Pathar Beachకు వెళ్తారు. అనంతరం Neil Island లో క్రూజ్ లో జర్నీ ఉంటుంది. సాయంత్రం సీతాపూర్ బీచ్ కు వెళ్తారు.
(image source from unsplash.com)(6 / 6)
ఐదో రోజు Bharatnagar బీచ్ కు వెళ్తారు. ఇక్కడ స్విమ్మింగ్ చేసే అవకాశం ఉంది. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ కు చేరుకుంటారు. ఆరో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. 09:55 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. హైదరాబాద్ కు మధ్యాహ్నం 12:10 గంటలకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.71,810గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.55200 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.53,560గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
(image source from unsplash.com)ఇతర గ్యాలరీలు