Prabhas The Raja Saab Release Date: ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ఇదే.. అదిరిపోయిన గ్లింప్స్.. సడెన్ సర్‌ప్రైజ్
Prabhas The Raja Saab Release Date: ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ రివీల్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఫస్ట్ గ్లింప్స్ కూడా అదిరిపోయేలా ఉంది.
Prabhas The Raja Saab Release Date: సలార్, కల్కి 2898 ఏడీ సక్సెస్ లతో ఊపు మీదున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ కూడా వచ్చేసింది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ మూవీ గ్లింప్స్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు.

ది రాజా సాబ్ రిలీజ్ డేట్
చాలా రోజులుగా సీరియస్ పాత్రలకే పరిమితమవుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి ఓ హారర్ రొమాంటిక్ కామెడీ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా పేరు ది రాజా సాబ్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. తాజాగా సోమవారం (జులై 29) మేకర్స్ గ్లింప్స్ వీడియో ద్వారా ఈ రిలీజ్ డేట్ ను వెల్లడించారు. దీంతో కల్కి 2898 ఏడీ తర్వాత రిలీజ్ కాబోతున్న ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఇదే కానుంది.
ఈ మధ్యే సై-ఫి డ్రామా కల్కి 2898 ఏడీతో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కొల్లగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు పూర్తి డిఫరెంట్ జానర్ లో, మారుతి డైరెక్షన్ లో తొలిసారి ఈ ది రాజా సాబ్ తో రాబోతున్నాడు. అసలు ఎవరూ అంచనా వేయని సమయంలో రాజా సాబ్ మేకర్స్ ఈ గ్లింప్స్ వీడియోతో ప్రభాస్ అభిమానులను సర్ ప్రైజ్ చేయడం విశేషం.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
బాహుబలి నుంచి ప్రభాస్ చాలా వరకు యాక్షన్ తో కూడిన సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ప్రభాస్ మరోసారి తనదైన కామెడీతో ఈ రాజా సాబ్ మూవీలో అదరగొట్టబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఈ గ్లింప్స్ వీడియోలో అతడు స్టైలిష్ లుక్ లో కనిపించాడు. మొదట్లోనే ఓ బైకుపై ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం చూడొచ్చు.
ఓ బ్లాక్ టీషర్ట్, పర్పుల్ కలర్ బ్లేజర్ లో చేతిలో ఓ పూల బొకే పట్టుకొని అతడు కనిపిస్తాడు. వెళ్తూ వెళ్తూ పక్కనే ఉన్న కారు అద్దంలో తన అందాన్ని చూసి ఏమున్నావ్ రా అంటూ తానే మురిసిపోతూ పూలతో దిష్టి తీసుకుంటాడు. ఆ పూలలో నుంచే ది రాజా సాబ్ మూవీ టైటిల్ రాగా.. గ్లింప్స్ చివర్లో ఇట్స్ టైమ్ ఫర్ హారర్ రొమాంటిక్ కామెడీ అంటూ సినిమా జానర్ ను మేకర్స్ రివీల్ చేశారు.
ఈ ది రాజా సాబ్ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలోనూ రిలీజ్ కాబోతోంది. మరి మారుతి, ప్రభాస్ లాంటి రేర్ కాంబినేషన్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
టాపిక్