Kalki 2898 AD Pre Release Business: రికార్డులు తిరగరాయనున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?-prabhas kalki 2898 ad pre release business set to break all the existing records telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Pre Release Business: రికార్డులు తిరగరాయనున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

Kalki 2898 AD Pre Release Business: రికార్డులు తిరగరాయనున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 14, 2024 10:53 AM IST

Kalki 2898 AD Pre Release Business: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ తన ప్రీరిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆర్ఆర్ఆర్ సహా అన్ని రికార్డులనూ బ్రేక్ చేయబోతోంది.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో..

Kalki 2898 AD Pre Release Business: ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి. పైగా ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో సహజంగానే ఈ ఆసక్తిని క్యాష్ చేసుకుంటూ మేకర్స్ భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ పై కన్నేశారు. కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.500 కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం.

కల్కి 2898 ఏడీ ప్రీరిలీజ్ బిజినెస్

ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. గతంలో ప్రాజెక్ట్ కేగా పిలిచిన ఈ సినిమాకు గతేడాది టైటిల్ పెట్టారు. ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ లాంటి ఇండియన్ సినిమా స్టార్లు నటిస్తున్న మూవీ కావడంతో కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో ప్రీరిలీజ్ బిజినెస్ తోనే ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. సలార్ సక్సెస్ తో మళ్లీ గాడిలో పడిన ప్రభాస్ కు మరోసారి మునుపటి రేంజ్ వచ్చేసింది. దీంతో కల్కి 2898 ఏడీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల విషయంలో ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేయనున్నట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్టు వెల్లడించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.200 కోట్లకుపైనే రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

థియేట్రికల్ హక్కులు@రూ.500 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.200 కోట్లకుపైగా అంటే.. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్లలో రూ.100 కోట్లకు హక్కులు అమ్మాలని భావిస్తున్నారు. గతంలో ఏ సినిమాకు ఈ స్థాయి బిజినెస్ సాధ్యం కాలేదు. ఇక ఇండియాలో మిగిలిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా హిందీ హక్కులు అన్నీ కలిపితే రూ.500 కోట్లు రాబట్టాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రూ.500 కోట్లకుపైనే ప్రీరిలీజ్ బిజినెస్ సాధించింది. రాజమౌళి డైరెక్షన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్ లాంటి నటీనటులు, సినిమాపై భారీ అంచనాలు ఈ స్థాయి బిజినెస్ కు కారణమయ్యాయి. అయితే అదే రేంజ్ లో కల్కి 2898 ఏడీ మూవీకి సాధ్యమేనా అన్నది చూడాలి. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ ప్రభాస్ మాత్రమే. అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీలాంటి వాళ్లు ఉన్నా.. బిజినెస్ జరిగేది మాత్రం ప్రభాస్ పేరు మీదే. సలార్ సూపర్ డూపర్ హిట్ కావడంతో తమ కల్కి ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. గతంలో ఎప్పుడూ చూడని వీఎఫ్ఎక్స్, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ అంటూ వస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న రిలీజ్ కాబోతోంది.

Whats_app_banner