Pushpa 2: పుష్ప 2పై గుర్రుగా మల్లు ఫ్యాన్స్.. ఐదు భాషలతో పోలిస్తే మలయాళంలో డల్-allu arjun pushpa 2 the rule mallu fans not happy with fahadh faasil role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2: పుష్ప 2పై గుర్రుగా మల్లు ఫ్యాన్స్.. ఐదు భాషలతో పోలిస్తే మలయాళంలో డల్

Pushpa 2: పుష్ప 2పై గుర్రుగా మల్లు ఫ్యాన్స్.. ఐదు భాషలతో పోలిస్తే మలయాళంలో డల్

Galeti Rajendra HT Telugu

Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీతో పాటు మలయాళంలోనూ విడుదలైంది. కానీ.. మిగిలిన ఐదు భాషలతో పోలిస్తే మలయాళంలో కలెక్షన్లు కాస్త డల్‌గా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే?

ఫహాద్ ఫాజిల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌గా నిలిచింది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ఆరు భాషల్లో రిలీజైన పుష్ప2 మూవీ.. ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.800 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అయితే.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీలో దుమ్మురేపుతున్న పుష్ప 2.. మలయాళంలో మాత్రం ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. దానికి కారణం.. మల్లు ఫ్యాన్స్ గుర్రుగా ఉండటమేనని తెలుస్తోంది.

స్క్రీన్ స్పేస్ పెరిగినా..?

పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ రో‌ల్‌పై ప్రేక్షకులు భారీగా అంచనాల్ని పెట్టుకున్నారు. 2021లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’లో భన్వర్ సింగ్ షెకావత్‌‌గా చాలా పవర్‌ఫుల్‌గా ఫహాద్ ఫాజిల్‌ని చూపించి సుకుమార్.. పుష్ప 2లో మాత్రం చాలా సిల్లీగా చూపించారు. పుష్ప రాజ్, భన్వర్ సింగ్ షెకావత్‌‌ మధ్య ఢీ.. అంటే ఢీ అనే సన్నివేశాలు ఊహించిన స్థాయిలో తెరపై కనిపించలేదు. మలయాళంలో ఇప్పటికే టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న ఫహాద్ ఫాజిల్‌ను ఇలా సిల్లీగా పుష్ప2లో చూపించడంపై మల్లు ఫ్యాన్స్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభావం.. మూవీ కలెక్షన్లపై కూడా కనిపిస్తున్నాయి.

పుష్ప 2 చూసిన తర్వాత.. పుష్ప 1లో ఫహాద్ ఫాజిల్ కనిపించింది కాసేపైనా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. కానీ.. పుష్ప2లో స్క్రీన్ స్పేస్ పెరిగినా.. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదని మలయాళీలు ఫీల్ అవుతున్నారు. అలానే ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎండింగ్ కూడా అర్థవంతంగా లేదు. దాంతో.. సినిమాపై కేరళవాసులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ ఉంటాడా?

పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల.. కిస్సిక్ అనే ఐటెం సాంగ్ చేసింది. రావు రమేశ్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. పుష్ప 3‌ కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే సుకుమార్ హింట్ ఇవ్వగా.. ఫహాద్ ఫాజిల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే.. పుష్ప2లో తన క్యారెక్టర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫహాద్ ఫాజిల్ నటిస్తాడా? లేదా? అనేది చూడాలి.