బ్రెజిల్ నట్స్ ఇటీవల బాగా పాపులర్ అవుతున్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్, సెలేనియం సహా చాలా పోషకాలు ఉంటాయి. ఈ బ్రెజిల్ నట్స్ రెగ్యులర్‌గా తింటే కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే..
Photo: Pixabay
బ్రెజిల్ నట్స్‌లో సెలేనియం మెండుగా ఉంటుంది. దీంతో ఇవి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహకరిస్తుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో శరీరం పోరాడేందుకు తోడ్పడుతుంది.
బ్రెజిల్ నట్స్ తినడం వల్ల మెదడుకు మేలు జరుగుతుంది. జ్ఞాపకశక్తిని ఈ నట్స్ మెరుగుపరచగలవు.
Photo: Pixabay
బ్రెజిల్ నట్స్‌లో ఒమేగా-3 సహా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‍ను తగ్గించలవు. దీంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Unsplash
బ్రెజిల్ నట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇవి రెగ్యులర్‌గా తింటే చర్మం పొడిబారకుండా, బిగుతుగా ఉండేలా చేయగలవు.
Photo: Unsplash
బ్రెజిల్ నట్స్ తింటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తినొచ్చు.
Photo: Pixabay
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా బ్రెజిల్ నట్స్ ఉపయోగపడతాయి. అందుకే డయాబెటిస్ ఉన్న వారు వీటిని తినొచ్చు.