తెలుగు న్యూస్ / ఫోటో /
Kadiyam Nursery : కడియం నర్సరీలు కన్నుల విందు, హరివిల్లులా పూల మొక్కలు
Kadiyam Nursery : కడియంలో హరివిల్లులా సీజనల్ పూల మొక్కలు మెరుస్తున్నాయి. సందర్శకులను రా...రమ్మని ఆహ్వానిస్తున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో వీటి హవా కొనసాగుతోంది.
(1 / 7)
కడియంలో హరివిల్లులా సీజనల్ పూల మొక్కలు మెరుస్తున్నాయి. సందర్శకులను రా...రమ్మని ఆహ్వానిస్తున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో వీటి హవా కొనసాగుతోంది. దీంతో సందర్శకులు, మొక్కలు కొనుగోలు చేసేవారు కడియం నర్సరీల్లో తలుక్కుమంటున్నారు. అందమైన వివిధ రకాల పూల మొక్కలతో సందర్శకులు ఫోటోలు దిగుతున్నారు.
(2 / 7)
క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగలలో అతిథులుగా మన వాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి. శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకొనే ఈ అందాల భామలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటాయి. మనింట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు.
(3 / 7)
కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు, దుంపలు, విత్తనాలు ద్వారా ఉత్పత్తి చేశారు. ఈ మొక్కలు ప్రాణం పోసుకుని అందాలు ఆరబోయడానికి ముస్తాబు అవుతున్నాయి. మరికొందరు రైతులు పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి. దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీల అన్నిటిలోనూ ఈ సీజన్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
(4 / 7)
వీటిని విరివిగా కొనుగోలు చేసి కిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు కొత్తదనంతో జరుపుకునేందుకు అనేక మంది తహతహ లాడుతున్నారు. ఇప్పటికే వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. మన ఇంట్లో రోజూ కనిపించే మొక్కల కంటే ఇవి చాలా భిన్నంగా.. అందంగా ఉంటాయి. డిసెంబరు ఆరంభం నుంచి ఈ సీజనల్ మొక్కల సందడి చేస్తాయి.
(5 / 7)
ఫిబ్రవరి ప్రారంభం నుంచి మంచు తగ్గడం మెదలవ్వడంతో ఈ మొక్కలు తనువుచాలిస్తాయి. అందుకనే సందర్శకులు కూడా డిసెంబరు, జనవరి నెలల్లో కడియం నర్సరీలను తిలకించడానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. వారిని ఆకట్టుకునే విధంగా నర్సరీ రైతులు కూడా ఈ మొక్కలను ఒక క్రమబద్ధంగా ఉంచి అందర్నీ కనువిందు చేయిస్తారు. ఇప్పుడు ఏ నర్సరీకి వెళ్లినా ఇంద్ర ధనస్సుల మాదిరిగా ఉండే ఈ సీజనల్స్ మొక్కలు రా.. రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి.
(6 / 7)
పలు రంగులతో ఉండే బంతి, చామంతిలతో పాటు పిటోనియా, బిగోనియా, వింకారోజ్, దయాంతాస్, జినియా, జర్బరియా, ఫెంటాస్, కొలియన్ కలర్స్, సాల్వియా సిల్వర్ కోకాస్, చైనా పింక్, లింక్ రోజ్, కారోనియా వంటి అనేక రకాల సీజనల్ మొక్కలు కడియం నర్సరీలలో సందడి చేస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు