Mutual Funds : మిలియనీర్ కావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ సూత్రం ఫాలో అవ్వండి!
Mutual Funds : మీరు కోటీశ్వరులు కావాలని అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని సూత్రాలు పాటించాలి. కొన్ని సాధారణ పెట్టుబడి నియమాలను పాటించడం ద్వారా ఆ కలను సాకారం చేసుకోవచ్చు. ఇందుకోసం 12-15-20 రూల్ పాటించండి.
డబ్బులు సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ మీరు పెట్టుబడి పెట్టే విధానంతో అది సాధ్యమవుతుంది. ఇందుకోసం మీరు కొన్ని రూల్స్ పాటించాలి. 12-15-20 నియమాన్ని పాటించాలి. మీ సంపదను పెంచుకోవాలంటే.. పెట్టుబడి పెట్టడం వెంటనే ప్రారంభించాలి. ముందుగా 12-15-20 రూల్ అర్థం చేసుకోవడం ముఖ్యం.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
12-15-20 నియమం అంటే 12 శాతం రాబడి, 15 అంటే 15 సంవత్సరాల నిరంతర పెట్టుబడి, 20 అంటే ప్రతి నెలా 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం.
మీరు 25 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే ఈ ఫార్ములాతో మీకు 40 ఏళ్లు వచ్చే సమయానికి మీరు మిలియనీర్ కావచ్చు. 12-15-20 నియమం అర్థమైంది కదా. ఏ పెట్టుబడి మీకు 12 శాతం రాబడిని పొందగలదో తెలుసుకోవాలి.
ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో మీరు ప్రతి నెలా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. స్టాక్ మార్కెట్ రాబడులను అంచనా వేయలేనప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో రాబడులను అందిస్తాయన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మ్యూచువల్ ఫండ్స్ 12 శాతం వరకు రాబడిని అందించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ కూడా రావొచ్చు.
మీరు SIP కాలిక్యులేటర్‌ని ఉపయోగించి 12-15-20 ప్లాన్ ఆధారంగా సంపదను సృష్టించవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.20,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు పెట్టుబడి అవుతుంది. 12 శాతం వడ్డీ రేటు రూ. 65 లక్షల విలువైన ఆదాయాన్ని తెస్తుంది. మీ జీతంలో 20-30 శాతం పెట్టుబడి పెట్టండి. మీ జీతం రూ.65,000 అయితే మీరు నెలకు రూ.19,500 పెట్టుబడి పెట్టాలి. మీరు చిన్న మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు. ఆ తర్వాత క్రమంగా ప్రతి సంవత్సరం 10-20 శాతం పెంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ 3 నుంచి 5 సంవత్సరాల పనితీరును తనిఖీ చేసిన తర్వాత ఎంచుకోండి.