UPSC Mains Result 2024 : యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూకు సెలక్ట్ అయినవారు వీరే!
UPSC Mains Result 2024 Out : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ 2024 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ 2024 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in, upsc.gov.inలో చూసుకోవచ్చు. మెయిన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇప్పుడు ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ ను త్వరలోనే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.
అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధాన కార్యాలయం, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ-110069లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అందుకు అనుగుణంగా పర్సనాలిటీ టెస్ట్ షెడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో జరిగింది. రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 14న ప్రారంభమై 2024 మార్చి 5న ముగిసింది. ప్రిలిమ్స్ పరీక్షను 2024 జూన్ 16న నిర్వహించగా, 2024 జూలై 1న ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
యూపీఎస్సీ మెయిన్స్ రిజల్ట్ 2024 ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా upsc.gov.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.
దీని తరువాత హోమ్ పేజీలో ఇచ్చిన యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ 2024 పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ స్క్రీన్‌పై రిజల్ట్ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు రిజల్ట్ పీడీఎఫ్ ఫైల్లో మీ పేరు, రోల్ నెంబర్ చెక్ చేసుకోవాలి.
రిజల్ట్ పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
భవిష్యత్తు అవసరాల కోసం మీ రిజల్ట్ పీడీఎఫ్ ఫైల్ ప్రింట్ తీసుకోండి.