AP Rain Updates: బంగాళా‌ాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఏపీకి వాన గండం, కోస్తా జిల్లాల్లో రైతులకు అలర్ట్…-low pressure area strengthening in bay of bengal heavy rains in ap alert for farmers in coastal districts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rain Updates: బంగాళా‌ాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఏపీకి వాన గండం, కోస్తా జిల్లాల్లో రైతులకు అలర్ట్…

AP Rain Updates: బంగాళా‌ాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఏపీకి వాన గండం, కోస్తా జిల్లాల్లో రైతులకు అలర్ట్…

Dec 10, 2024, 05:16 AM IST Bolleddu Sarath Chandra
Dec 10, 2024, 05:16 AM , IST

  • AP Rain Updates: బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలకు అనువుగా ఉండటంతో వరుసగా ఏర్పడుతున్నాయి. ఫెంగల్‌ ముప్పు తప్పగానే మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వివిధ జిల్లాల్లో వర్గాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ  సంస్థ హెచ్చరించింది. రాయలసీమకు మళ్లీ ముప్పు పొంచి ఉంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆగ్నేయ బంగాళాఖాతంలోనే అల్పపీడనం స్థిరంగా కేంద్రీకృతమైఉంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో (ముఖ్యంగా చిత్తూరు,తిరుపతి,అన్నమయ్య) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(1 / 10)

అల్పపీడనం నేపథ్యంలో  రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిసెంబర్ 10 ,మంగళవారం : • అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

(2 / 10)

డిసెంబర్ 11, బుధవారం  ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. •కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 

(3 / 10)

డిసెంబర్ 12, గురువారం  తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  నెల్లూరు, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  కాకినాడ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

(4 / 10)

ఆంధ్రప్రదేశ్‌కు వానగండం వీడటం లేదు. పంటలు చేతికి అందే సమయంలో కురుస్తున్న వర్షాలతో  ఏపీలోని కోస్తా, రాయలసీమల్లోనూ వేలాది ఎక రాల్లో పంట నష్టం వాటిల్లింది. దాని నుంచి ఇంకా కోలుకోక ముందే రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఇది స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా రానుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రికి వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. 

(5 / 10)

బంగాళాఖాతంలో  ఈ నెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే 'పెంగల్' తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీని ప్రభా వంతో ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీసత్యసాయి అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, జాపట్ల, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ జారీవర్గాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు

(6 / 10)

(@APSDMA)

ప్రస్తుతం బంగాళాఖాతంలో తూర్పుగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, అందువల్ల కొద్దిరోజులుగా తమిళ నాడు, దానికి ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని తెలిపారు. మరికొద్ది రోజులు తూర్పుగాలుల ప్రభావం కొనసాగుతుందని, ఒక్కొక్కసారి సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటాయని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు.  

(7 / 10)

మంగళవారం అల్లూరి, కాకినాడ, కోన సీమ, పశ్చి మగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంత పురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తెలికపాటి వర్గాలు పడతాయని పేర్కొంది. వరి రైతులు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ సూచించింది.

(8 / 10)

వాయుగుండం నేపథ్యంలో  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని,  దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు గంటకు 50-70కిమీ వీచే అవకాశం ఉంది. బుధవారం నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయి. ఈ  నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. 

(9 / 10)

నాలుగు రోజులు వర్షాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వివి ధ జిల్లాల్లో వర్గాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ, సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్న, మయ్య జిల్లాల్లో బారీ వర్గాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు