Alluri News : అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం-బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌తో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
Alluri News : అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తలిగి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌తో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఈ ఘటన ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింటింది. ఆ కుటుంబంలో ఒకేసారి ముగ్గురు మృతి చెందారు. తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లా పెదబయలు మండలం కిముడు పల్లె గ్రామంలో విద్యుత్ షాక్‌తో తల్లి, కుమారుడు, కుమార్తె మృతి చెందారు. ఒకే సారి ముగ్గురు ప్రాణాలు విడిచారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సోమవారం నాడు కొర్ర లక్ష్మి కుమారుడు సంతోష్ (13) తీగపై బట్టలు ఆరబెడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. అది చూసి కుమారుడు ప్రమాదంలో పడ్డాడని తెలుసుకున్న తల్లి కొర్రలక్ష్మి (36), కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. ఆ తరువాత అక్కడకు కుమార్తె అంజలి (10) వచ్చింది. దీంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఊహించని పరిణామంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనతో కిముడుపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే మృతిరాలు లక్ష్మికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారులను పట్టుకుని నాన్నమ్మ కన్నీరుపెట్టడంతో అందరి హృదయాలను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెదబయలు మండల కేంద్రానికి పంపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెదబయలు ఎస్ఐ కె.రమణ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం