Polimera 3 Glimpse: పొలిమేర 3 గ్లింప్స్‌ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. నేరుగా ఓటీటీలోకి?-polimera 3 official announcement with glimpse satyam rajesh polimera 3 glimpse video polimera 3 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Polimera 3 Glimpse: పొలిమేర 3 గ్లింప్స్‌ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. నేరుగా ఓటీటీలోకి?

Polimera 3 Glimpse: పొలిమేర 3 గ్లింప్స్‌ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. నేరుగా ఓటీటీలోకి?

Sanjiv Kumar HT Telugu
Jul 10, 2024 01:02 PM IST

Polimera 3 Official Announcement: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ సినిమాల్లో ఒకటైన పొలిమేర సినిమాకు మరో సీక్వెల్ రానుంది. ఇప్పటికే మా ఊరి పొలిమేర, పొలిమేర 2 హిట్ కాగా త్వరలో పొలిమేర 3 రానున్నట్లు గ్లింప్స్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పొలిమేర 3 గ్లింప్స్ వైరల్ అవుతోంది.

పొలిమేర 3 గ్లింప్స్‌ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. నేరుగా ఓటీటీలోకి?
పొలిమేర 3 గ్లింప్స్‌ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. నేరుగా ఓటీటీలోకి?

Polimera 3 Glimpse Released: తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన హారర్ సినిమాగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది మా ఊరిపొలిమేర. నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఈ మూవీ తర్వాత దీనికి సీక్వెల్‌గా పొలిమేర 2 తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.

అయితే, పొలిమేర 2 సినిమాను మొదటి పార్ట్‌లా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేశారు. థియేటర్‌లలో రిలీజైన పొలిమేర 2 సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేవలం రూ. 3 కోట్లతో రూపొందించిన పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 15 కోట్లు కొల్లగొట్టింది. పేరు చిన్న సినిమా అయిన ఎన్నో అంచనాల మధ్య విడుదలై అంతకుమించి సక్సెస్ అందుకుంది.

అయితే, పొలిమేర 2కి కూడా సీక్వెల్ ఉంటుదనే హింట్‌తో మూవీని ముగించారు. పొలిమేర 3 కూడా ఉంటుందని ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే మేకర్స్ చెప్పారు. ఇప్పుడు పొలిమేర 3 గ్లింప్స్ విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. పొలిమేర 2 క్లైమాక్స్‌లో నటుడు బబ్లూ పృథ్వీరాజ్ చెప్పే "లెట్స్ బిగిన్ ది షో" అనై డైలాగ్‌తో పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్ ప్రారంభం అయి క్యూరియాసిటీ పెంచింది.

అయితే, మా ఊరు పొలిమేర, పొలిమేర 2 సినిమాలోని సన్నివేశాలతోనే పొలిమేర 3 గ్లింప్స్ సాగింది. పొలిమేర 3 లోడింగ్ అంటూ షేర్ చేసిన ఈ వీడియో గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పొలిమేర 3 సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనలు మొదలు పెట్టినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ మూడో పార్ట్‌కు కూడా డా. అనిల్ విశ్వ‌నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ నందిపాటి నిర్మాతగా వ్యవహరించగా భోగేంద్ర గుప్తా సహా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బబ్లూ పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పొలిమేర 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కాగా మా ఊరి పొలిమేర సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాగా పొలిమేర 2 థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే, ఇప్పుడు పొలిమేర 3ని థియేటర్లలో విడుదల చేస్తారా.. లేదా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. పొలిమేర 2కి వచ్చిన క్రేజ్‌ను బట్టి థియేటర్లలోనే పొలిమేర 3 విడుదల చేస్తారని తెలుస్తోంది.

కాకపోతే థియేట్రికల్ రిలీజ్ అనంతరం పొలిమేర 3 మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లేదా ఆహా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే మొదటి పార్ట్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంటే.. రెండో పార్ట్ అయిన పొలిమేర 2 ఆహాలో ప్రసారం అవుతోంది. ఇకపోతే పొలిమేర 2లో కామాక్షి భాస్కర్ల పాత్ర చనిపోయినట్లు చూపించారు. సత్యం రాజేష్‌కు పక్షవాతం వచ్చినట్లుగా ముగించారు.

WhatsApp channel