Polimera 2 Twitter Review: మా ఊరి పొలిమేర 2 ట్విటర్ రివ్యూ.. అదిరిపోయే ట్విస్టులు.. రాజమౌళి కూడా తీయలేడట!
Maa Oori Polimera 2 Twitter Review: సత్యం రాజేష్ తాజాగా నటించిన చిత్రం మా ఊరి పొలిమేర 2. శుక్రవారం విడుదల కానున్న మా ఊరి పొలిమేర 2 ట్విటర్ రివ్యూలో నెటిజన్స్, ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం.
మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది మా ఊరి పొలిమేర 2. గౌరికృష్ణ నిర్మాతగా డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. నేడు అంటే నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న మా ఊరి పొలిమేర 2 ట్విటర్ రివ్యూలో మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
"అదిరిపోయే ట్విస్టులతో మా ఊరి పొలిమేర 2 సినిమా సెకండాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. క్లైమాక్స్ కాస్తా స్లోగా ఉంది. కానీ, ట్విస్ట్ బాగుంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా. మా ఊరి పొలిమేర 3 పార్టు కోసం ఎదురుచూస్తున్నాను" అని మరొక నెటిజన్ పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చాడు.
"మా ఊరిపొలిమేర 2 ఫస్టాఫ్ అంతా మా ఊరి పొలిమేర రిక్యాప్‌లా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వడం, సీన్లు, ఇంటర్వెల్ బాగున్నాయి. సెకండాఫ్ చాలా బాగుంది. ట్విస్టులతో ఎంగేజింగ్‌గా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. క్లైమాక్సులో మూడో పార్టుకు హింట్ ఇచ్చారు. దానికోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ఈ సినిమాకు 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు మరో నెటిజన్.
"మా ఊరి పొలిమేర 2 నెరేషన్ సూపర్బ్ గా ఉంది. ఎక్సలెంట్ డైరెక్షన్, ఇక బీజీఎమ్ అయితే అగ్గి రాజేసింది" అని ఒకరు చెప్పుకొచ్చారు. "ఈ మధ్యకాలంలో చూసిన వాటిలో బెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్, టర్న్స్ ఉన్నాయి. స్క్రీన్‌ప్లే క్రేజీగా ఉంది. కచ్చితంగా చూడాల్సిన చిత్రం" అని మరొకరు తెలిపారు.
"ఎక్సలెంట్ బీజీఎమ్‌తో మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ పార్ట్ ఎక్సలెంట్‌గా ఉంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2కు లింక్ చేసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఎక్కడా బోరింగ్ సన్నివేశాలు లేవు" అని మరొక నెటిజన్ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.
"మా ఊరి పొలిమేర తరహాలోనే మా ఊరి పొలిమేర 2 సినిమాను ఓటీటీలో విడుదల చేసి ఉంటే హిట్ అయ్యేదేమో" అని ఒక నెటిజన్ ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు "ఎందుకు బ్రో నెగెటివ్ స్ప్రెడ్ చేస్తావ్ మూవీ చూడకుండా. రాజమౌళి, లోకేష్ కూడా ఇంతమంచి మూవీ తీయలేరేమో" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.