Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్-payal rajput faces ban threats she considering legal action on rakshana movie makers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Chatakonda Krishna Prakash HT Telugu
May 20, 2024 08:50 AM IST

Payal Rajput: తెలుగు సినిమాల నుంచి బ్యాన్ చేస్తాంటూ తనను ఓ మూవీ మేకర్స్ బెదిరిస్తున్నారని పాయల్ రాజ్‍పుత్ వెల్లడించారు. తన పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్
Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Payal Rajput: టాలీవుడ్‍లో తన తొలి మూవీ ఆర్ఎక్స్ 100తో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. మంగళవారం సినిమాతో గతేడాది మంచి హిట్ సాధించారు. అయితే, గతంలో తాను నటించిన ఓ మూవీ విషయంలో పాయల్ ఇప్పుడు వేదింపులు ఎదుర్కొంటుకున్నారు. ఈ విషయన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. తాను నటించిన రక్షణ మూవీ రిలీజ్ కాలేదని, అయితే ఇప్పుడు ఆ మూవీ మేకర్స్ నుంచి తాను బెదిరింపులు, వేదింపులు ఎదుర్కొంటున్నానని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు పాయల్.

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు

తాను రీసెంట్‍గా సక్సెస్ అవటంతో గతంలో చిత్రీకరించిన రక్షణ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని పాయల్ పేర్కొన్నారు. అయితే, తనకు ఎలాంటి బకాయిలు చెల్లించకుండానే ప్రమోషన్లకు రావాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపారు. “2019, 2020ల్లో రక్షణ సినిమా (5Ws) షూటింగ్ చేశా. రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, నా రీసెంట్ సక్సెస్‍ నుంచి లాభపడాలని వారు నాకు ఎలాంటి బకాయిలు చెల్లించకుండా.. ప్రమోషన్లను రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రమోషన్లకు రాలేనని నా టీమ్ వారికి చెప్పింది. కానీ, నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని వారు బెదిస్తున్నారు” అని పాయల్ రాజ్‍పుత్ పోస్ట్ చేశారు.

నా పేరును చెడగొడుతున్నారు

తన ప్రతిష్టకు భంగం కలిగేంచేలా రక్షణ మూవీ టీమ్ వ్యవహరిస్తోందని పాయల్ రాజ్‍పుత్ తెలిపారు. “రక్షణ సినిమాకు డిజిటల్ ప్రమోషన్ల కోసం నా టీమ్ వారితో చర్చించేందుకు ప్రయత్నించింది. రెమ్యూనరేషన్ బకాయిలు ముందుగా చెల్లించాలని కోరింది. అయితే, వారు దానికి అంగీకరించలేదు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరు వాడుతున్నారు. ఇది అసలు సరికాదు” అని పాయల్ తెలిపారు.

అభ్యంతరకరంగా మాట్లాడారు

ఇటీవల జరిగిన మీటింగ్‍లో తనతో అభ్యంతరకరంగా మాట్లాడారని పాయల్ రాజ్‍పుత్ రాసుకొచ్చారు. ఓ డిస్ట్రిబ్యూటర్ తనను కొన్ని శరీర భాగాలు చూపించాలని కోరారని, లేకపోతే సినిమాను అంగీకరించబోమని అన్నారని పాయల్ ఆరోపించారు.

అయితే, ఎలాంటి బకాయిలు చెల్లిచకుండా.. తన అనుమతి లేకుండా రక్షణ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని.. వారి న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నానని పాయల్ తెలిపారు. లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పరిగణిస్తున్నానని సోషల్ మీడియాలో తెలిపారు. ఇంపార్టెంట్ మెసేజ్ అంటూ దీన్ని పోస్ట్ చేశారు పాయల్.

పాయల్ రాజ్‍పుత్‍కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. ఆమెను ఇలా బెదిరించడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవలే రిలీజ్ డేట్

రక్షణ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ ఠాకూర్ నిర్మాతగానూ ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‍ను టీమ్ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‍పుత్ పోలీసాఫీసర్‌గా నటించారు. మరి, పాయల్ రాజ్‍పుత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం సద్దుమణుగుతుందో.. మరింత పెద్దదవుతుందో చూడాలి.